News February 18, 2026
కర్నూలు: ఒక్క నిమిషం ఆలస్యమైనా..

కర్నూలు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో రికార్డు అసిస్టెంట్, ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి నేడు రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు సంస్థ కార్యదర్శి లీలా వెంకటేశ్ శేషాద్రి తెలిపారు. అభ్యర్థులు నిర్దేశించిన సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఆయన సూచించారు. గేట్ క్లోజర్ సమయం తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా ఎవరినీ లోపలికి అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News March 14, 2026
ఏలూరులో ఈనెల 17న జాబ్ మేళా

ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో కెపీడీటీ హైస్కూల్‌లో ఈనెల 17న (మంగళవారం) జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యా అభివృద్ధి సంస్థ అధికారి జితేంద్ర ఓ ప్రకటనలో తెలిపారు. 20 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని, 1,497 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయన్నారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ, ఎంబీఏ, పీజీ, బీటెక్, ఫార్మసీ విద్య అర్హత కలిగిన 18-35 ఏళ్లవారు అర్హులన్నారు.
News March 14, 2026
MDK: ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీశ్ రావు లేఖ

కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని హరీశ్ రావు ఆరోపించారు. ఈ విషయమై రాష్ట్ర నీటి పారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. మైనర్, సబ్ మైనర్ కాలువల నిర్మాణానికి భూసేకరణ కోసం రూ.30 కోట్లు కేటాయించాలని కోరారు. నిధులు కేటాయిస్తే మరో లక్ష ఎకరాలకు కొత్త ఆయకట్టు సాధ్యమవుతుందని తెలిపారు.
News March 14, 2026
జాకారం సర్పంచ్ వాంగ్మూలం రికార్డు చేసిన పోలీసులు

జాకారం సర్పంచ్ సమత ఆత్మహత్యాయత్నం చేసిన అంశంపై కలెక్టర్ దివాకర ఆరా తీశారు. పంచాయతీ అధికారుల ద్వారా సమాచారం సేకరించారు. ఈ క్రమంలో ములుగు ఎస్సై ఉపేందర్ రావు జిల్లా ఆస్పత్రికి వెళ్లి సర్పంచ్ వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఆత్మహత్యకు ప్రేరేపించిన పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ విషయంపై ఫిర్యాదు చేయాలని కుటుంబ సభ్యులకు సూచించారు. కాగా, మహిళా సర్పంచ్ ఆత్మహత్యాయత్నం చర్చనీయాంశంగా మారింది.


