News March 19, 2024
కర్నూలు: ఓటర్ల జాబితాలో ఓటు లేకపోతే నమోదు చేసుకోండి

కర్నూలు ఓటర్ల జాబితాలో ఓటు లేకపోతే వెంటనే నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సృజన తెలిపారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 15 వరకు గడువు ఉందని ఆమె పేర్కొన్నారు. జిల్లాల్లో మొత్తం 20,30,377 మంది ఓటర్లు ఉన్నారని, ఇందులో పురుషులు 10,01,971, స్త్రీలు 10,28,096 మంది కాగ, ఇతరులు 310 ఉన్నారు. ఇప్పటికి ఓటరు జాబితాలో పేరు లేని వాళ్ళు నమోదు చేసుకోవాలని తెలిపారు.
Similar News
News April 4, 2025
దేవసేన శోభా బర్త్ డే.. మనోజ్ ఎమోషనల్ పోస్ట్!

మంచు మనోజ్, భూమా మౌనిక దంపతులు తమ ముద్దుల కుమార్తె దేవసేన శోభా MM తొలి పుట్టినరోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలను మంచు మనోజ్ నెట్టింట షేర్ చేసి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘అంతకు ముందు మేము ముగ్గురం. ఏడాది క్రితం నలుగురం అయ్యాం. దేవసేన శోభ జననం మా జీవితాల్లో వెలుగుతోపాటు ధైర్యాన్ని, అంతులేని సంతోషాన్ని తీసుకొచ్చింది. కుమార్తెను కంటికి రెప్పలా కాపాడుకుంటాం’ అని రాసుకొచ్చారు.
News April 4, 2025
కర్నూలు: ‘విమానాశ్రయానికి వసతులు కల్పించాలి’

కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయంలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని జాయింట్ కలెక్టర్ బి.నవ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఏరోడ్రోమ్ కమిటీ, ఎయిర్ ఫీల్డ్ ఎన్విరాన్మెంట్ కమిటీ సమావేశాన్ని జాయింట్ కలెక్టర్ నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఎయిర్పోర్ట్ ఆవరణంలో పచ్చదనాన్ని గణనీయంగా పెంచే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News April 4, 2025
కర్నూలు జిల్లా నేతలతో వైఎస్ జగన్ సెల్ఫీ

కోడుమూరు వైసీపీ నేత, కుడా మాజీ ఛైర్మన్ కోట్ల హర్షవర్దన్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకకు హాజరైన మాజీ సీఎం వైఎస్ జగన్ జిల్లా నేతలను ఆప్యాయంగా పలకరించారు. వారి కోరిక మేరకు సెల్ఫీ తీసుకున్నారు. అందుకు సంబంధించిన ఫొటోను ఎమ్మిగనూరు వైసీపీ ఇన్‌ఛార్జి బుట్టా రేణుక నెట్టింట పోస్ట్ చేశారు. ‘జగనన్నతో స్నేహపూర్వక సమావేశం. ఆప్యాయంగా సెల్ఫీ తీసుకున్నారు’ అని ట్వీట్ చేశారు.