News October 29, 2024

కర్నూలు: కారును ఢీకొన్న లారీ.. వ్యక్తి దుర్మరణం

image

గోనెగండ్ల మండల పరిధిలోని ఎస్.లింగందిన్నె వద్ద కారును లారీ ఢీకొన్న ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. అనంతపురం జిల్లా కొనకండ్లకు చెందిన కుమ్మరి హేమాద్రి, భార్య, కుమారుడు, కుమార్తెతో కలిసి మంగళవారం కర్నూలుకు వెళ్తుండగా ఎస్.లింగందిన్నె సమీపంలో లారీ రివర్స్‌లో వచ్చి కారును ఢీకొంది. హేమాద్రికి తీవ్ర గాయాలు కావడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కోలుకోలేక హేమాద్రి(38) మృతి చెందాడు.

Similar News

News October 30, 2024

‘ఉర్దూ పాఠశాల నిర్మాణ గదులు పూర్తి చేయాలి’

image

మండల కేంద్రమైన దేవనకొండలో మొండి గోడలకే పరిమితమైన ఉర్దూ పాఠశాల నిర్మాణ గదులు పూర్తిచేయాలని జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు కాకర్ల శాంతి కుమార్ కోరారు. ఈ మేరకు మంగళవారం డీఈవో శ్యాముల్ పాల్‌కు వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ.. ఉర్దూ పాఠశాల భవనం ఏర్పాటు కోసం దేవనకొండ సంతమార్కెట్ వద్ద గ్రామ పంచాయతీ స్థలం ఇచ్చిందని, 2014లో నిర్మాణ పనులు ప్రారంభించి మొండి గోడలకే పరిమితం చేశారన్నారు.

News October 29, 2024

ట్రాన్స్ జెండర్లకు సహాయ సహకారాలు: కలెక్టర్

image

ప్రభుత్వం తరఫున ట్రాన్స్ జెండర్లకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ రంజిత్ బాషా పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ట్రాన్స్ జెండర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ట్రాన్స్ జెండర్‌కు పెన్షన్ అందించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

News October 29, 2024

డీఐజీని కలిసిన పదోన్నతులు పొందిన ఎస్ఐలు

image

కర్నూలు రేంజ్ డీఐజీ కార్యాలయంలో పదోన్నతులు పొందిన 11 మంది ఎస్ఐలు డీఐజీ కోయ ప్రవీణ్‌ను మంగళవారం కలిశారు. పదోన్నతులు రావడం అభినందనీయమని, మిగిలిన సర్వీసును కూడా రిమార్కు లేకుండా పూర్తి చేయాలని డీఐజీ వారికి సూచించారు. విధులలో మంచి ప్రతిభ కనబరచి మరిన్ని పదోన్నతులు పొందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీఐజీ మేనేజర్ విజయరాజు ఉన్నారు.