News January 12, 2025

కర్నూలు: కిడ్నాప్ కేసులో బాలుడి కథ సుఖాంతం

image

గత నెల 20న కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్‌నకు గురైన బాలుడి కథ సుఖాంతం అయ్యిందని కర్నూలు డీఎస్పీ జే.బాబు ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు వివరాలను ఆదివారం వెల్లడించారు. కిడ్నాప్ కేసులో భాగంగా పోలీసులు జిల్లా మొత్తం తనిఖీలు చేపట్టడంతో గత అర్ధరాత్రి నిద్రపోతున్న ఓ జంట వద్ద దుండగులు బాలుడిని వదిలి వెళ్లిపోయారు. వారు పోలీసులకు తెలపడంతో తల్లిదండ్రులను పిలిపించి బాలుడి అప్పజెప్పారు.

Similar News

News October 22, 2025

రైలు నుంచి జారిపడిన వ్యక్తి

image

మంత్రాలయం రైల్వే స్టేషన్ వద్ద తమిళనాడుకు చెందిన వ్యక్తి రైలు నుంచి జారిపడి రెండు కాళ్లు పోయాయి. స్పందించిన రైల్వే పోలీసులు వెంటనే అంబులెన్స్‌లో ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. బతుకుదెరువు కోసం సోలాపూర్ వెళ్లి తిరిగి మధురై వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపినట్లు సమాచారం.

News October 22, 2025

Congratulations మేఘన

image

పెద్దకడబూరు జడ్పీ పాఠశాలలో చదివే 9వ తరగతి విద్యార్థిని మేఘన ‘క్వాంటం ఏజ్ బిగిన్స్-పొటెన్షియల్ అండ్ చాలెంజెస్’ అనే అంశంపై జరిగిన రాష్ట్రస్థాయి సెమినార్‌లో ప్రతిభ చాటారు. ఈ మేరకు ప్రశంసా పత్రం, మెడల్ మంగళవారం హెచ్ఎం ఉమా రాజేశ్వరమ్మ చేతుల మీదుగా మేఘనకు అందజేశారు. మనమంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నామని, కాబట్టి విద్యార్థులు క్వాంటం మెకానిక్స్ అనే అంశంపై ఆసక్తిని పెంపొందించుకోవాలన్నారు.

News October 21, 2025

ప్రాథమిక స్థాయిలోనే ఆంగ్ల భాషపై దృష్టి పెట్టండి: కలెక్టర్

image

ప్రాథమిక స్థాయిలోనే ఆంగ్ల భాషపై దృష్టి సారించాలని, అందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించాలని జిల్లా విద్యాశాఖ అధికారులను కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశించారు. మంగళవారం జిల్లా విద్యాధికారి శామ్యూల్ పాల్‌తో పాటు విద్యాశాఖ అధికారులతో పూర్వ ప్రాథమిక విద్యపై కలెక్టర్ సమీక్ష చేశారు. ప్రాథమిక విద్యలోనే ఆంగ్ల భాష నైపుణ్యాలను విద్యార్థులకు అందించేందుకు 20 మంది రిసోర్స్ పర్సన్లను నియమించాలన్నారు.