News November 18, 2024
కర్నూలు: కూరలో మాత్రలు కలిపిన విద్యార్థులు.. 9 మంది ఆస్పత్రి పాలు

కర్నూలు సీ.క్యాంపులోని ప్రభుత్వ బాలుర వికలాంగుల హాస్టల్లో ఇద్దరు అకతాయిలు చేసిన పనికి 9మంది అస్వస్థతకు గురయ్యారు. కూరలో గుర్తుతెలియని మాత్రలు కలపడంతో అది తిన్న వారు తీవ్ర అస్వస్థతతకు గురయ్యారని జిల్లా వికలాంగుల శాఖ సహాయ సంచాలకులు రయీస్ ఫాతిమా తెలిపారు. పీజీ విద్యార్థి ఓ 8వ తరగతి విద్యార్థితో కలిసి శనివారం రాత్రి సొరకాయ కూరలో మాత్రలు కలిపారన్నారు. బాధితులను కర్నూలు ఆస్పత్రికి తరలించామన్నారు.
Similar News
News October 20, 2025
నేడు రద్దు: ఎస్పీ

దీపావళి పండుగ సందర్భంగా ఇవాళ జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. కర్నూలు కొత్తపేటలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఈ వేదిక జరగాల్సి ఉంది. పండుగ కారణంగా ప్రభుత్వ సెలవు దినం కావడంతో కార్యక్రమం నిలిపివేశామని ఎస్పీ పేర్కొన్నారు. సుదూర ప్రాంతాల నుంచి అర్జీలు ఇవ్వడానికి వచ్చే ప్రజలు వ్యయప్రయాసలతో రావొద్దని విజ్ఞప్తి చేశారు.
News October 19, 2025
కర్నూలు: 9 నెలల్లో 6,858 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

కర్నూలు రేంజ్లో 9 నెలల్లో మద్యం మత్తులో వాహనాలు నడిపిన 6,858 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసినట్లు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ వివరాలు వెల్లడించారు. రహదారి భద్రతలో భాగంగా ప్రతి రోజు వాహన తనిఖీలు నిర్వహించి, డ్రైవర్లకు కౌన్సెలింగ్ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన 13,555 మందిపై కూడా కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
News October 19, 2025
లిక్కర్ షాపుల కోసం రూ.4.5 కోట్లు పెట్టిన కర్నూలు మహిళ

కర్నూలు జిల్లాకు చెందిన ఓ మహిళ తెలంగాణలోని 150 వైన్ షాపులకు దరఖాస్తు చేసింది. ఇందుకోసం ఆమె రూ.4.5 కోట్లు చెల్లించింది. ఏపీకి సరిహద్దుల్లో ఉండే జిల్లాల్లోని షాపులకు ఈమె ఎక్కువగా దరఖాస్తు చేసినట్టు సమాచారం. ఆమెకు ఏపీలోనూ ఎక్కువ దుకాణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 23న డ్రా ద్వారా వైన్ షాపులకు లైసెన్స్ ఇవ్వనున్నారు.