News September 16, 2024

కర్నూలు క్విజ్.. వీటికి సమాధానాలు తెలుసా?

image

☛ ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా కర్నూలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సేవలందించింది?
☛ కొండారెడ్డి బురుజును ఎవరు నిర్మించారు?
☛ ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జన్మించిన గ్రామం పేరేంటి?
☛ పూర్వం నంద్యాలను ఏ పేరుతో పిలిచేవారు?
☛ వరల్డ్​బుక్​ ఆఫ్​రికార్డ్స్‌లో శ్రీశైలం ఆలయానికి చోటు దక్కడానికి కారణమేంటి?
★ పై ప్రశ్నలకు సమాధానాలను కామెంట్ చేయగలరు?
నోట్: మధ్యాహ్నం 2 గంటలకు ఇదే ఆర్టికల్‌లో జవాబులను చూడొచ్చు.

Similar News

News October 28, 2025

కర్నూలు: బస్సు ప్రమాదం కేసులో డ్రైవర్ అరెస్ట్.!

image

కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో 24వ తేదీన జరిగిన బస్సు ప్రమాదం కేసులో వి.కావేరీ ట్రావెల్స్ డ్రైవర్ మిరియాల లక్ష్మయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. కేసు విచారణలో భాగంగా పత్తికొండ DSP వెంకట్రామయ్య పర్యవేక్షణలో విచారణ జరిపి, నిందితుడిని మంగళవారం సాయంత్రం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు జిల్లా SP విక్రాంత్ పాటిల్ తెలిపారు.

News October 28, 2025

కర్నూలు: ‘ర్యాగింగ్ చేస్తే కఠిన చర్యలు’

image

ఇంటరాక్షన్ పేరుతో ర్యాగింగ్ చేసినా ఉపేక్షించమని మంగళవారం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. కేఎంసీలో యాంటీ ర్యాగింగ్ అవగాహన సమావేశంలో పాల్గొన్న ఎస్పీ మాట్లాడుతూ.. వైద్య విద్యార్థులు సమాజానికి సేవ చేసే గొప్ప బాధ్యత కలవారని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రిన్సిపల్ చిట్టి నరసమ్మ, సూపరిండెంట్ వెంకటేశ్వర్లు, సాయి సుధీర్, రేణుక దేవి, సీఐ శేషయ్య తదితరులు పాల్గొన్నారు.

News October 28, 2025

కర్నూలు: గృహ నిర్మాణంపై చర్చించిన హౌసింగ్ డైరెక్టర్

image

కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో ఇటీవల ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమితులైన ఆరేకల్ రామకృష్ణ మంగళవారం హౌసింగ్ ప్రోగ్రామింగ్ డైరెక్టర్ చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇద్దరూ జిల్లా గృహ నిర్మాణ ప్రగతిపై, అలాగే 2014–2019 మధ్య పెండింగ్‌లో ఉన్న హౌసింగ్ బిల్లుల పరిష్కారం వంటి అంశాలపై విశదంగా చర్చించారు.