News June 24, 2024

కర్నూలు: గిరిజన ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడి మృతి

image

తుగ్గలి మండలం పరిధిలోని రాతన గిరిజన ఆశ్రమ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న రాముడు(58) సోమవారం అనారోగ్యంతో మృతి చెందారు. సంజామల మండలానికి చెందిన ఆయన గత కొన్ని సంవత్సరాల నుంచి గిరిజన ఆశ్రమ పాఠశాలలో వార్డెన్ , ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కర్నూలు ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

Similar News

News November 7, 2025

విద్యార్థులు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి: ఎస్పీ

image

ఆటోలు కళాశాలల స్కూల్ బస్సుల్లో విద్యార్థులను, ప్రజలను పరిమితికి మించి ఎక్కించుకొని ప్రయాణించరాదని ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్పష్టంచేశారు. గురువారం ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ రూల్స్‌పై పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. కళాశాలలు, స్కూల్ యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ వాడటం, రోడ్ల వెంట ఆటోలను నిలపడం, మద్యం తాగి వాహనాలు నడిపడం వంటికి చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

News November 6, 2025

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-2025కు సిద్ధం కావాలి: చీఫ్ ఎలక్టోరల్ అధికారి

image

కర్నూల్ జిల్లాలో ఓటర్ల జాబితా లోపరహితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను చీఫ్ ఎలక్టోరల్ అధికారి వివేక్ యాదవ్ ఆదేశించారు. కర్నూలు కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ డా.ఏ.సిరి, అధికారులు పాల్గొన్నారు. కొత్తగా 18 ఏళ్లు నిండిన వారిని ఓటర్‌లుగా నమోదు చేయాలన్నారు. డూప్లికెట్, చనిపోయిన ఓటర్ల పేర్లు తొలగించాలని కలెక్టర్‌ను ఆదేశించారు.

News November 5, 2025

ప్రైవేట్, ఆర్టీసీ బస్సుల్లో ముమ్మర తనిఖీలు

image

ఇటీవల జరిగిన బస్సు ప్రమాదం నేపథ్యంలో రాత్రి పూట నడిచే ప్రైవేట్, ఆర్టీసీ ట్రావెల్స్ బస్సుల్లో భద్రతా ప్రమాణాల అమలుపై ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. వాహన పత్రాలు, డ్రైవర్ల లైసెన్సులు, భద్రతా పరికరాలు పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.