News July 15, 2024
కర్నూలు: గూడ్స్ ట్రైన్ కిందపడి వ్యక్తి మృతి
మద్దికేర మండల కేంద్రానికి సమీపాన ఉన్న మల్లప్ప గేటు దగ్గర సోమవారం తెల్లవారుజామున గూడ్స్ ట్రైన్ కిందపడి వ్యక్తి మృతిచెందాడు. ఈ మేరకు గుంతకల్లు రైల్వే పోలీసులు వెల్లడించారు. మృతిచెందిన వ్యక్తి దగ్గర ఎలాంటి ఆనవాళ్లు లేకపోవడంతో గుర్తించలేకపోయామన్నారు. ఎవరైనా గుర్తిస్తే గుంతకల్లు ఆర్పీఎఫ్ స్టేషన్ ఫోన్ నంబర్‌కు 9550111589 తెలపాలని కోరారు.
Similar News
News October 14, 2024
జ్వరంతో కొడుకు మృతి.. విషాదంలో తల్లి
ఆస్పరికి చెందిన శివ(16) జ్వరంతో మృతిచెందాడు. తల్లి మహేశ్వరి హోటల్ నడుపుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. శివకు జ్వరం రావడంతో శనివారం ఆదోనిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమించడంతో కర్నూలు ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. భర్త భీమేష్ 2018లో అనారోగ్యంతో మృతి చెందాడు. కుటుంబానికి ఆధారమైన భర్త, కొడుకు మృతి చెందడం ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.
News October 14, 2024
KNL: నేడే లాటరీ.. తీవ్ర ఉత్కంఠ..!
ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా కొత్తగా నెలకొల్పనున్న (కర్నూలు-99, నంద్యాల-105) మద్యం దుకాణాల నిర్వహణకు ఇవాళ టెండర్లు నిర్వహించనున్నారు. దీంతో దరఖాస్తుదారుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కర్నూలుకు సంబంధించి జడ్పీ సమావేశ మందిరంలో, నంద్యాలకు సంబంధించి కలెక్టరేట్ సెంటినరీ హాల్లో లాటరీలు తీయనున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాల ఎస్పీలు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
News October 14, 2024
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు: కలెక్టర్
భారీ వర్షాలు పడే అవకాశాలు ఉండటంతో కలెక్టరేట్‌లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రంజిత్ బాషా పేర్కొన్నారు. ఆదివారం అధికారులతో ఆయన టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, లోతట్టు ప్రాంతాలలో నివసించే ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ఏ సమస్య ఉన్నా కమాండ్ కంట్రోల్ రూమ్ 08518-277305కు ఫోన్ చేయాలని విజ్ఞప్తి చేశారు.