News December 27, 2024

కర్నూలు జిల్లాతో మన్మోహన్‌కు అనుబంధం

image

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు కర్నూలు జిల్లాతో అనుబంధం ఉంది. జులై 1, 2004న ఆయన జిల్లాలో పర్యటించారు. ఓర్వకల్లు మండలం సోమయాజులపల్లి గ్రామంలో ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కలిసి ఆయన బాధితులకు అండగా నిలిచారు. అలాగే మన్మోహన్ సింగ్ క్యాబినెట్‌లో కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి రైల్వేశాఖ సహాయ మంత్రిగా సేవలందించారు.

Similar News

News December 29, 2024

PGRSను సద్వినియోగం చేసుకోండి: కర్నూలు కలెక్టర్

image

కర్నూలు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియం నందు ఈ నెల 30న నిర్వహించే ప్రజా వినతుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చే ఆయా వినతులను వేగవంతంగా పరిష్కరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు హాజరు కావాలని ఆదేశించారు.

News December 29, 2024

ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం: మంత్రి బీసీ

image

ప్రజల సహకారం లేకుంటే ఏ కార్యక్రమాన్ని విజయవంతం చేయలేమని, ప్లాస్టిక్ రహిత సమాజాన్ని తీసుకురావాలంటే వారి సహకారం అవసరమని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. శనివారం బనగానపల్లెలోని మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి – ఇందిరమ్మ దంపతుల ఆధ్వర్యంలో ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా మెగా ర్యాలీని నిర్వహించారు. ప్లాస్టిక్ రహిత బనగానపల్లెగా తీర్చిదిద్దుతామని అన్నారు.

News December 28, 2024

కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో అరుదైన ఆపరేషన్

image

కడప మహిళకు కర్నూలులో వైద్యులు అరుదైన ఆపరేషన్ పూర్తి చేశారు. కడపకు చెందిన రమణమ్మ గత కొన్నినెలలుగా కడుపునొప్పితో బాధపడుతోంది. పరీక్షించిన వైద్యులు కిడ్నీ, లివర్‌కు దగ్గరలో రక్తనాళాలు ఆనుకొని 8.సెం.మీ గడ్డ ఉన్నట్లు గుర్తించారు. ఆమెను కర్నూలుకు రెఫర్ చేయగా.. యురాలజీ HOD డా. కే. సీతారామయ్య బృందంతో మూడు గంటల పాటు శ్రమించి కణితిని తొలగించినట్లు తెలిపారు. ఆమెను శుక్రవారం డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు.