News December 27, 2024
కర్నూలు జిల్లాతో మన్మోహన్‌కు అనుబంధం
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు కర్నూలు జిల్లాతో అనుబంధం ఉంది. జులై 1, 2004న ఆయన జిల్లాలో పర్యటించారు. ఓర్వకల్లు మండలం సోమయాజులపల్లి గ్రామంలో ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కలిసి ఆయన బాధితులకు అండగా నిలిచారు. అలాగే మన్మోహన్ సింగ్ క్యాబినెట్‌లో కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి రైల్వేశాఖ సహాయ మంత్రిగా సేవలందించారు.
Similar News
News January 21, 2025
కర్నూలు జిల్లా కొత్త ఎస్పీ నేపథ్యం ఇదే!
కర్నూలు జిల్లా నూతన ఎస్పీగా <<15208705>>ఐపీఎస్<<>> అధికారి విక్రాంత్ పాటిల్ నియమితులైన విషయం తెలిసిందే. విక్రాంత్ గతంలో చిత్తూరు జిల్లా ఎస్పీ, విజయవాడ డీసీపీ, చింతలవలస ఏపీఎస్పీ 5వ బెటాలియన్ కమాండెంట్, మన్యం జిల్లా ఎస్పీగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన కాకినాడ జిల్లా ఎస్పీగా, ఏపీఎస్పీ 3వ బెటాలియన్ కమాండెంట్‌గా ఉన్నారు. ఆయన సతీమణి దీపికా పాటిల్ కూడా ఐపీఎస్ అధికారే. గతంలో కర్నూలు ఏఎస్పీగా సేవలందించారు.
News January 21, 2025
ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టండి: నంద్యాల కలెక్టర్
ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జిల్లా నలుమూలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రతి అధికారి తన లాగిన్‌లో ఉన్న అర్జీలను అదే రోజు చూసి యాక్సెప్ట్ చేయడం లేదా సంబంధిత శాఖకు ఫార్వర్డ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
News January 20, 2025
కర్నూలు జిల్లా ఎస్పీగా విక్రాంత్ పాటిల్
కర్నూలు జిల్లా ఎస్పీ జి.బిందుమాధవ్ బదిలీ అయ్యారు. నూతన ఎస్పీగా 2012 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన విక్రాంత్ పాటిల్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన కాకినాడ జిల్లా ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు. త్వరలో కర్నూలు జిల్లా నూతన ఎస్పీగా విక్రాంత్ బాధ్యతలు చేపట్టనున్నారు. బిందుమాధవ్ కాకినాడ ఎస్పీగా నియమితులయ్యారు.