News March 1, 2025
కర్నూలు జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం

కర్నూలు జిల్లా వ్యాప్తంగా 69 పరీక్షా కేంద్రాలలో ఇంటర్మీడియట్ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటలకే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. 8.30 నుంచి చెక్ చేసి లోపలికి అనుమతించారు. ఇవాళ ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు పేపర్ 1 సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష జరుగుతోంది. కర్నూల్ నగర వ్యాప్తంగా 32 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
Similar News
News October 17, 2025
కర్నూలులో ప్రధాని సభ విజయవంతం: సీఎం

కర్నూలులో ప్రధానమంత్రి ఆధ్వర్యంలో జరిగిన సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ సభ విజయవంతంగా నిర్వహించినందుకు జిల్లా అధికారులను సీఎం చంద్రబాబు అభినందించారు. శుక్రవారం సాయంత్రం మంత్రులు, ఉన్నతాధికారులు, కర్నూలు-నంద్యాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో సీఎం మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రధాని నాలుగోసారి రాష్ట్ర పర్యటనలో పాల్గొన్నారని, కర్నూలు సభ గొప్ప విజయం సాధించింది అని సీఎం అన్నారు.
News October 17, 2025
జనసేన అభిమాని అర్జున్ మృతిపై లోకేశ్ దిగ్భ్రాంతి

కర్నూలులో నిన్న జరిగిన జీఎస్టీ సభలో విద్యుత్ షాక్ తగిలి జనసేన అభిమాని అర్జున్ (15) మృతిపై మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అతడి మృతి తనను కలచివేసిందని పేర్కొన్నారు. అర్జున్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. మరోవైపు మృతుడి కుటుంబానికి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. అర్జున్ కర్నూలు మండలం మునగాలపాడు గ్రామానికి చెందిన వారు.
News October 16, 2025
కర్నూలులో మొట్టమొదటి ఈ-కోర్ట్ ప్రారంభం

రెండు తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిగా కర్నూలులో ఈ-కోర్ట్ ఏర్పాటు చేశారు. దీనిని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డా.పి.చంద్రశేఖర్ గురువారం ప్రారంభించారు. వైద్యులు, సిబ్బంది ఇక్కడి నుండే రాష్ట్రంలో ఏ కోర్టుకైనా సాక్ష్యాన్ని అందించవచ్చని చెప్పారు. దీని ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతుందని తెలిపారు.