News March 12, 2025

కర్నూలు జిల్లాలో ఇద్దరు విద్యార్థుల డిబార్

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా బుధవారం ఇంటర్మీడియట్ రెండో సంవత్సర విద్యార్థులకు ఫిజిక్స్‌ పేపర్ 2, ఎకనామిక్స్‌ పేపర్ 2 పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలో ఇద్దరు విద్యార్థులను డిబార్ చేసినట్లు ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి గురువయ్య శెట్టి తెలిపారు. 20,499 మంది పరీక్షకు హాజరు కాగా 401 విద్యార్థులు గైర్హాజరైనట్లు వివరించారు. మద్దికేరలోని ఏపీ మోడల్ జూనియర్ కళాశాలలో ఇద్దరు విద్యార్థులు డిబార్ అయినట్లు చెప్పారు.

Similar News

News April 15, 2026

పీజీఆర్ఎస్ అర్జీలకు వేగవంత పరిష్కారం: కలెక్టర్

image

పీజీఆర్ఎస్‌లో వచ్చిన అర్జీలను వేగంగా, నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ ఏ.సిరి రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతీ రోజు లాగిన్‌లో అర్జీలను పరిశీలించి, వెంటనే స్పందించాలని సూచించారు. ప్రజలకు పారదర్శక సేవలు అందించి సానుకూల స్పందన శాతాన్ని పెంచాలని తెలిపారు. జిల్లాలో 104 శాతం ఆదాయం సాధించడంపై ప్రశంసించారు.

News April 15, 2026

కర్నూలు జిల్లా విద్యార్థుల ప్రతిభ ఇలా..

image

కర్నూలు జిల్లా ఇంటర్ ఫలితాల వివరాలను ఆర్ఐఓ లాలప్ప వెల్లడించారు. ఉత్తీర్ణతలో బీసీ రెసిడెన్షియల్ కళాశాలలు ప్రథమ సంవత్సరంలో 97%, ద్వితీయ సంవత్సరంలో 100% ఫలితాలతో అగ్రస్థానంలో నిలిచాయి. ఏపీఆర్ఎస్ నుంచి 91%, 97% సాధించగా, ప్రభుత్వ కళాశాలలు 44%, 71% ఫలితాలు నమోదు చేశాయి. ప్రైవేట్ విద్యాసంస్థలు 71%, 85% ఉత్తీర్ణత సాధించాయి. విద్యార్థుల ప్రతిభపై అధికారులు హర్షం వ్యక్తం చేశారు.