News October 30, 2024
కర్నూలు జిల్లాలో కరవు మండలాలు ఇవే!
కర్నూలు జిల్లాలోని కౌతాళం, పెద్దకడుబూరు మండలాలను కరవు మండలాలుగా ప్రకటించినట్లు ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఈ రెండు మండలాలను మధ్యస్థ కరవు మండలాలుగా ప్రభుత్వం పేర్కొందన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఖరీఫ్-2024 నివేదికల ప్రకారం ఈ మండలాలను మధ్యస్థ కరవు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించినట్లు ఆయన వెల్లడించారు.
Similar News
News October 30, 2024
KNL: బాలికతో అసభ్య ప్రవర్తన.. కరెస్పాండెంట్‌పై పోక్సో కేసు?
కర్నూలులోని బుధవారం పేటలో ఉన్న ఓ స్కూల్ కరస్పాండెంట్ చంద్రశేఖర్ 8వ తరగతి విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించిన విషయం తాజాగా వెలుగుచూసింది. స్థానికుల వివరాల మేరకు.. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు నిన్న రాత్రి 9 గంటల సమయంలో స్కూల్‌పై దాడి చేసి కరస్పాండెంట్ చంద్రశేఖర్‌ను చితకబాదారు. ఆపై మూడో పట్టణ పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై పోక్సో చట్టాలను అనుసరించి కేసు నమోదు చేశారు.
News October 30, 2024
కర్నూలు: బీఈడీలో ఫెయిలైన వారికి మరో అవకాశం
రాయలసీమ యూనివర్సిటీ పరిధిలోని బీఈడీలో ఫెయిల్ అయిన విద్యార్థులకు మరో అవకాశాన్ని కల్పిస్తున్నట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. వర్సిటీ పరిధిలోని బీఈడీ కళాశాలలో విద్యను అభ్యసించి కోర్సును పూర్తి చేసుకోలేని 2015, 2016, 2017, 2018, 2019 విద్యా సంవత్సరాలకు చెందిన విద్యార్థులకు మరో అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. ఫెయిల్ అయిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News October 30, 2024
ఆదోని మార్కెట్ యార్డుకు 4 రోజుల సెలవులు
దీపావళి వేళ ఆదోని మార్కెట్ యార్డుకు రేపటి నుంచి ఆదివారం వరకు సెలవులు ప్రకటించారు. హమాలీ సంఘాలు, కమీషన్ ఏజెంట్ల విన్నపం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మార్కెట్ యార్డ్ కార్యదర్శి రామ్మోహన్ రెడ్డి తెలిపారు. నవంబర్ 4 నుంచి క్రయవిక్రయాలు మొదలవుతాయని చెప్పారు. రైతులు గమనించాలని కోరారు.