News October 31, 2024

కర్నూలు జిల్లాలో టపాసుల మోత

image

జిల్లాలో వెలుగుల పండుగ దీపావళి సందడి మొదలైంది. ప్రజలు లక్ష్మీపూజలు, నోములు, వ్రతాలు చేశారు. ఈ సారి 20 శాతం మేర టపాసుల ధరలు పెరిగినా ఎవరి సామర్థ్యం మేరకు వారు కొనుగోలు చేశారు. దీంతో పట్టణాలు, గ్రామాల్లో ఎటుచూసినా పటాసుల శబ్దాలే వినిపిస్తున్నాయి. కర్నూలు, నంద్యాల, ఆళ్లగడ్డ, డోన్, ఆదోని వంటి ప్రధాన పట్టణాల్లో టపాసుల మోత మోగుతోంది. మరి మీ ఇంట దీపావళిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కామెంట్ చేయండి..

Similar News

News December 25, 2025

కర్నూలు: 9025 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు: ఎస్పీ

image

రోడ్డు ప్రమాదాల నివారణకు కర్నూల్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు. 2025 జనవరి నుంచి డిసెంబర్ 20 వరకు 9,025 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశామన్నారు. మద్యం తాగి వాహనం నడిపిన వారికి జరిమానాతో పాటు ఒక నెల జైలు శిక్ష విధించినట్లు చెప్పారు.

News December 25, 2025

గ్రామసభల్లో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు: కలెక్టర్

image

రీ సర్వే పూర్తైన గ్రామాల్లో రైతులకు జనవరి 2 నుంచి 9 వరకు గ్రామసభల ద్వారా కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. పాత భూ హక్కు పత్రాలు తీసుకుని రాజముద్రతో ఉన్న కొత్త పాస్ పుస్తకాలు అందజేస్తామని పేర్కొన్నారు. రైతులు గ్రామసభలకు హాజరుకావాలని కోరారు. గతంలో పంపిణీ చేసిన పాస్ పుస్తకలను వెనక్కి తీసుకొని రాజముద్ర కలిగిన పుస్తకలను అందజేస్తామన్నారు.

News December 25, 2025

వరస వివాదాల్లో శ్రీశైలం మల్లన్న క్షేత్రం!

image

శ్రీశైలం మల్లన్న క్షేత్రం వరస వివాదాలతో SMలో వైరల్ అవుతోంది. భద్రతా లోపాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. మొన్న నిబంధనలకు విరుద్ధంగా ఓ అధికారి వ్యవహారం, ఓ యువతి డాన్స్, నిన్న క్షేత్ర పరిధిలో పేకాట తదితర ఘటనలతో మల్లన్న క్షేత్రం పేరు తెరపైకొస్తుంది. మరోవైపు అర్హతలను మరచి ప్రమోషన్లు ఇవ్వడంపై విమర్శలొస్తున్నాయి. ఆ మల్లన్నే శ్రీశైలం క్షేత్రాన్ని కాపాడాలని పలువురు కోరుతున్నారు.