News September 30, 2024
కర్నూలు జిల్లాలో టమాటా ధర అదరహో

టమాటా రైతులకు కాసుల పంట పండుతోంది. కర్నూలు జిల్లాలో కిలో రూ.70 వరకు పలుకుతోంది. రైతుబజార్లలో కిలో రూ.30 నుంచి ₹44గా ఉంది. ప్రస్తుతం జిల్లాలో రోజుకు 600 టన్నుల వరకు దిగుబడి వస్తోంది. 25 కిలోల బాక్స్ ₹1400 వరకు పలుకుతోంది. పత్తికొండ, డోన్, ప్యాపిలి, ఆస్పరి, దేవనకొండ, క్రిష్ణగిరి, హొళగుంద, మద్దికెర, పెద్దకడబూరు, కల్లూరు తదితర మండలాల్లో ఈ పంటను సాగు చేశారు. జిల్లాలో సుమారు 10 వేల ఎకరాల్లో సాగులో ఉంది.
Similar News
News December 6, 2025
హోంగార్డుల సేవలు ప్రశంసనీయం: జిల్లా SP.!

పోలీసుశాఖలో హోంగార్డుల విధులు, సేవలు ఆదర్శప్రాయమని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ అభినందించారు. శనివారం పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన 63వ హోంగార్డు ఆవిర్భావ దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సాయుధ హోంగార్డుల ప్లటూన్ల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం పరేడ్‌ను పరిశీలించారు. హోంగార్డులు పోలీసులతో సమానంగా శాంతి భద్రతల పరిరక్షణలో ముందుంటారన్నారు.
News December 6, 2025
బిల్వ స్వర్గం గుహల్లో పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్.!

నంద్యాల జిల్లా బేతంచెర్ల మండల పరిధిలోని కనుమకింది కొట్టాల గ్రామ సమీపాన ఉన్న బిళ్ళస్వర్గం గుహల వద్ద సినిమా షూటింగ్ సందడి నెలకొంది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా యూనిట్ బృందం గుహల సన్నివేశాల చిత్రీకరణ కోసం వచ్చింది. దీంతో ఈ సందర్భంగా సినిమా యూనిట్ బృందం తరలిరావడంతో గుహల్లో సందడి వాతావరణం నెలకొంది.
News December 6, 2025
కర్నూలు జిల్లా రైతులకు శుభవార్త.!

కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో వడ్ల కొనుగోలు ఈనెల 8న ప్రారంభం కానుందని మార్కెట్ యార్డ్ కార్యదర్శి జయలక్ష్మి వెల్లడించారు. మార్కెట్ యార్డు కార్యాలయంలో అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. రైతులు పండించిన వడ్ల పంటను మార్కెట్ యార్డుకు తీసుకురావాలని కోరారు. ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధర(MSP)కు అనుగుణంగా పారదర్శకంగా కొనుగోళ్లు జరుగుతాయని అన్నారు.


