News June 5, 2024
కర్నూలు జిల్లాలో టీడీపీ హవా.. 2 సీట్లకే వైసీపీ పరిమితం
కర్నూలు జిల్లాలోని టీడీపీ హవా కొనసాగింది. 7 నియోజకవర్గాల్లో 4 స్థానాల్లో విజయం సాధించింది. కర్నూలు నియోజకవర్గంలో టీజీ భరత్, పత్తికొండలో కేఈ శ్యాంబాబు, కోడుమూరులో బొగ్గుల దస్తగిరి, ఎమ్మిగనూరులో బీవీ జయనాగేశ్వర రెడ్డి గెలిచారు. వైసీపీ కేవలం మంత్రాలయంలో వై.బాలనాగిరెడ్డి, ఆలూరులో బీ.విరుపాక్షి, బీజేపీ పోటీ చేసిన ఒకేఒక్క స్థానం ఆదోనిలో పార్థసారథి విజయం సాధించారు.
Similar News
News November 2, 2024
కర్నూలు జిల్లాలోని శివాలయాల్లో ఆధ్యాత్మిక శోభ
కార్తీక మాసం సందర్భంగా ఉమ్మడి కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం, మహానంది, యాగంటి, ఓంకారం, భోగేశ్వరాలయం, కాల్వబుగ్గ, సంగమేశ్వరం, రుద్రకోడూరులోని క్షేత్రాల్లో కార్తీకమాస మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. వీటితోపాటు అహోబిలం, మంత్రాలయం, ఉరుకుంద క్షేత్రాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. కార్తీకమాసం ప్రారంభం సందర్భంగా శనివారం వేకువజామునే భక్తులు ఆయా ఆలయాలను సందర్శించి కార్తీకదీపాలను వెలిగించారు.
News November 2, 2024
నదీ తీర ప్రాంతాల దగ్గర అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ
కార్తీక మాసం సందర్భంగా తెల్లవారుజాము నుండే శైవ ఆలయాలకు, నదీ తీర ప్రాంతాలు, వంకలు, చెరువులలో పుణ్య స్నానాలు ఆచరించడానికి వెళ్లే భక్తులకు కర్నూలు ఎస్పీ కీలక సూచనలు చేశారు. తమ వెంట చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళలను తీసుకొని వెళ్తే.. వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. కర్నూలులో కార్తీక దీపాలు వదిలే వినాయక్ ఘాట్, ఓర్వకల్లు శ్రీ కాల్వబుగ్గ రామేశ్వరం శివాలయం, తదితర చోట్ల భక్తుల జాగ్రత్తగా ఉండాలన్నారు.
News November 1, 2024
రూ.2,800 కోట్లతో ఓర్వకల్ పారిశ్రామిక వాడ అభివృద్ధి: మంత్రి భరత్
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.2,800 కోట్లతో ఓర్వకల్ పారిశ్రామిక వాడ అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి టీజీ భరత్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. సూపర్ 6 హామీల అమలులో భాగంగా దీపం-2 పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీ నాగరాజు, జాయింట్ కలెక్టర్ బీ.నవ్య పాల్గొన్నారు.