News October 31, 2024
కర్నూలు జిల్లాలో దీపావళి సందడి

జిల్లాలో దీపావళి సందడి నెలకొంది. ప్రజలు లక్ష్మీదేవిని పూజించి పండగను వైభవంగా జరుపుకుంటున్నారు. కర్నూలు, నంద్యాల, డోన్, బనగానపల్లి, ఆళ్లగడ్డ, ఆదోని, పత్తకొండ తదితర పట్టణాల్లో టపాసుల దుకాణాలు కిటకిటలాడాయి. పల్లెల నుంచి తరలివచ్చిన ప్రజలు తమకు ఇష్టమైన టపాసులను కొనుగోలు చేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే బాణసంచా సామగ్రి ధరలు ఈసారి పెరిగాయి. సుమారు 20% వరకు పెరిగినట్టు వినియోగదారులు చెబుతున్నారు.
Similar News
News October 28, 2025
సిద్ధంగా ఉంచండి: కలెక్టర్

మొంథా తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ సిరి పేర్కొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలకు పంపేందుకు అసరమైన ఉద్యోగులు, సిబ్బంది, సామగ్రిని సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. ప్రమాదకర వంతెనల వద్ద సిబ్బందిని ఉంచడంతో పాటు వెంటనే మరమ్మతులు చేసేందుకు గుత్తేదారులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.
News October 27, 2025
ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి: కలెక్టర్

ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి హౌసింగ్, పీజీఆర్ఎస్ తదితర అంశాలపై మండల స్పెషల్ ఆఫీసర్లు, డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
News October 27, 2025
ఆయుధాలపై విద్యార్థులకు ఎస్పీ అవగాహన

పోలీసులు వినియోగించే ఆయుధాలు, సాధనాల పట్ల విద్యార్దులు అవగాహన కల్గి ఉండటం మంచిదని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. సోమవారం జిల్లా డీపీఓలో ఏర్పాటుచేసిన పోలీస్ ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని విద్యార్థులతో కలిసి ఎస్పీ పరిశీలించారు. పోలీసు అమర వీరులను ప్రతి ఒక్కరం స్మరించుకుందాం అన్నారు. ప్రజల్లో పోలీసు వ్యవస్థ పట్ల విశ్వాసం పెంపొందించామన్నారు.


