News January 7, 2025

కర్నూలు జిల్లాలో నిందితుడి పరార్?

image

పోలీసుల అదుపులో నుంచి నిందితుడు పరారైన ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. ఆదోని పట్టణ పరిధిలో జరిగిన చోరీ కేసులో నిందితుడిని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. సోమవారం కోర్టుకు తీసుకెళ్తుండగా పోలీసులకు మస్కా కొట్టి పరారైనట్లు సమాచారం. ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. అయితే సంబంధిత స్టేషన్ సిబ్బంది నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

Similar News

News October 22, 2025

చిన్నపిల్లల సంరక్షణ సంస్థలను తరచూ తనిఖీ చేయాలి: కలెక్టర్

image

జిల్లాలోని చిన్నపిల్లల సంరక్షణ సంస్థలను తరచూ తనిఖీ చేసి చట్టవిరుద్ధంగా ఉన్న వాటిని రద్దు చేయాలని కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జరిగిన మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. సంస్థలకు వచ్చిన నిధులు, ఖర్చులు, మౌలిక వసతుల వివరాలు సమగ్రంగా ఇవ్వాలని ఐసీడీఎస్ పీడీని ఆదేశించారు. బాల్య వివాహాలు, బాల కార్మికుల నియంత్రణపై చర్యలు వేగవంతం చేయాలని సూచించారు.

News October 22, 2025

ఆదోని ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం వాయిదా

image

ఆదోని మండల ఎంపీపీ దానమ్మపై పెట్టిన అవిశ్వాస తీర్మానం వాయిదా పడింది. 28 ఎంపీటీసీ సభ్యుల్లో కనీసం 17 మంది మద్దతు అవసరమని అధికారులు స్పష్టం చేశారు. తీర్మానానికి అవసరమైన సంఖ్య లేని కారణంగా అధికారులు అవిశ్వాసాన్ని వాయిదా వేశారు. కొన్ని రోజులుగా ఆదోనిలో ఎంపీపీ అవిశ్వాసంపై నెలకొన్న ఉత్కంఠ ఇక్కడితో శాంతించింది. ఎంపీపీగా దానమ్మ కొనసాగనున్నారు.

News October 22, 2025

రైలు నుంచి జారిపడిన వ్యక్తి

image

మంత్రాలయం రైల్వే స్టేషన్ వద్ద తమిళనాడుకు చెందిన వ్యక్తి రైలు నుంచి జారిపడి రెండు కాళ్లు పోయాయి. స్పందించిన రైల్వే పోలీసులు వెంటనే అంబులెన్స్‌లో ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. బతుకుదెరువు కోసం సోలాపూర్ వెళ్లి తిరిగి మధురై వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపినట్లు సమాచారం.