News January 7, 2025
కర్నూలు జిల్లాలో నిందితుడి పరార్?
పోలీసుల అదుపులో నుంచి నిందితుడు పరారైన ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. ఆదోని పట్టణ పరిధిలో జరిగిన చోరీ కేసులో నిందితుడిని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. సోమవారం కోర్టుకు తీసుకెళ్తుండగా పోలీసులకు మస్కా కొట్టి పరారైనట్లు సమాచారం. ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. అయితే సంబంధిత స్టేషన్ సిబ్బంది నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
Similar News
News January 20, 2025
కర్నూలు జిల్లా ఎస్పీగా విక్రాంత్ పాటిల్
కర్నూలు జిల్లా ఎస్పీ జి.బిందుమాధవ్ బదిలీ అయ్యారు. నూతన ఎస్పీగా 2012 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన విక్రాంత్ పాటిల్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన కాకినాడ జిల్లా ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు. త్వరలో కర్నూలు జిల్లా నూతన ఎస్పీగా విక్రాంత్ బాధ్యతలు చేపట్టనున్నారు. బిందుమాధవ్ కాకినాడ ఎస్పీగా నియమితులయ్యారు.
News January 20, 2025
ఆళ్లగడ్డ హత్యాయత్నం కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష
ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్ పరిధిలో 2018లో జరిగిన హత్యాయత్నం కేసుకు సంబంధించి కోర్టు తీర్పు వెల్లడించింది. మహమ్మద్ రఫీ అలియాస్ పెద్దలాలు అనే వ్యక్తిపై నేరం రుజువు కావడంతో ఆళ్లగడ్డ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి శైలజ ముద్దాయికి 5 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు. ఈ కేసులో విచారణ అధికారిగా ప్రీతం రెడ్డి, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గోపాలకృష్ణారెడ్డి, శివప్రసాదరావులు తమ వాదనలు వినిపించారు.
News January 20, 2025
ప్రేమ పేరుతో లెక్చరర్ మోసం.. ఆదోని సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు
తనను ప్రేమ పేరుతో నమ్మించి ఓ లెక్చరర్ మోసం చేశాడని ఓ యువతి సోమవారం ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. కౌతాళం మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న ఆయన 2023-24 సంవత్సరంలో ప్రేమిస్తున్నారని, పెళ్లి చేసుకుంటానని చెప్పాడని తెలిపారు. అప్పటి నుంచి ఇరువురం ప్రేమలో ఉన్నామని పేర్కొన్నారు. తాజాగా ఇష్టం లేదంటూ పెళ్లికి నిరాకరిస్తున్నారని ఆమె ఫిర్యాదు చేశారు.