News March 4, 2025

కర్నూలు జిల్లాలో నేటి ముఖ్య వార్తలు

image

➤ కర్నూలు: వలస కూలీల కొడుకు ఎస్ఐగా ఎంపిక ➤ డిగ్రీ విద్యార్థి అదృశ్యం ➤ త్వరలో కౌతాళంలో 100 పడకల ఆసుపత్రి➤ మంత్రాలయం శ్రీ మఠానికి పోటెత్తిన భక్తులు➤ ఇంటర్ పరీక్షల్లో ఏడుగురు డీబార్➤ క్లస్టర్ యూనివర్సిటీ వీసీకి ఆత్మీయ వీడ్కోలు➤ అసెంబ్లీల బడ్జెట్‌పై ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ప్రసంగం➤ కర్నూలులో ఘోర ప్రమాదం.. రిటైర్డ్ వార్డెన్ మృతి ➤ రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్‌లో కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ

Similar News

News April 9, 2026

పోషణ పక్వాడ కార్యక్రమాలు నిర్వహించాలి: కలెక్టర్ సిరి

image

కర్నూలు జిల్లాలో ఈనెల 9 నుంచి 23 వరకు జరగనున్న పోషణ పక్వాడ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఏ.సిరి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో పోషణ పక్వాడ పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. 2 ఏళ్లలోపు పిల్లలకు మొబైల్, టీవీ స్క్రీన్‌లను పూర్తిగా దూరం పెట్టాలని సూచించారు. జంక్ ఫుడ్స్‌కు బదులుగా పప్పులు, పల్లీలు, పండ్లు వంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రోత్సహించాలని చెప్పారు.

News April 9, 2026

పాత వాహనాల కొనుగోలులో జాగ్రత్తలు: ఎస్పీ

image

పాత వాహనాలు కొనుగోలు చేసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. తక్కువ ధరకు వస్తున్నాయని రిజిస్ట్రేషన్ పత్రాలు లేని వాహనాలు కొనవద్దని హెచ్చరించారు. వాహనం కొనుగోలు ముందు ఆర్సీ, ఇన్సూరెన్స్, పీయూసీ వివరాలు RTA వెబ్‌సైట్‌లో చెక్ చేయాలని సూచించారు. చాసిస్, ఇంజిన్ నంబర్లు ఆర్సీతో సరిపోల్చాలన్నారు. విక్రేత అసలు యజమానా, కాదో నిర్ధారించుకోవాలన్నారు.

News April 9, 2026

చండ్ర రాజేశ్వరరావు మహానేత: సీపీఐ నేత రామకృష్ణ

image

చండ్ర రాజేశ్వరరావు పార్టీ బలోపేతానికి విశేష కృషి చేసిన మహానేత అని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ కొనియాడారు. పత్తికొండ సీపీఐ కార్యాలయంలో చండ్ర రాజేశ్వరరావు వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. రామకృష్ణ మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించి, పేదలకు భూములు పంచిన త్యాగశీలి అన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు యువత, పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.