News December 7, 2024

కర్నూలు జిల్లాలో ‘నో డ్రగ్స్ బ్రో’ క్యాంపెయిన్

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో శుక్రవారం ఎస్పీ జి.బిందు మాధవ్ ఆదేశాల మేరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్, హోంమంత్రి అనిత స్ఫూర్తితో ‘నో డ్రగ్స్ బ్రో’ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆదోని మండలం దొడ్డనకేరి మోడల్ ప్రైమరీ స్కూల్లో ఓ దివ్యాంగ విద్యార్థి తన తల్లిదండ్రులతో కలిసి డ్రగ్స్ నిర్మూలనపై ప్లకార్డుతో అవగాహన కల్పించారు.

Similar News

News January 25, 2025

హత్యకు గురైన ఈరన్నకు వైసీపీ నేతల నివాళి

image

ఆలూరు మండలం అరికెర గ్రామంలో శుక్రవారం ఫీల్డ్ అసిస్టెంట్ ఈరన్న హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇవాళ కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి గ్రామంలో ఈరన్న భౌతికకాయానికి నివాళులర్పించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు.

News January 25, 2025

ఫీల్డ్ అసిస్టెంట్ హత్య.. కేసు నమోదు

image

ఆలూరు మండలం అరికెరలో ఫీల్డ్ అసిస్టెంట్ ఈరన్న హత్యకు ఉద్యోగ విషయంలో నెలకొన్న వివాదాలే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఉద్యోగం వదిలేయాలంటూ టీడీపీ నేతలు ఒత్తిడి చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. లేకుంటే హత్య చేస్తామని బెదిరించి చివరకు అన్నంతపని చేశారని వాపోయారు. మృతుడి భార్య నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేశామని డీఎస్పీ వెంకటరామయ్య తెలిపారు.

News January 25, 2025

విషాదం.. అంత్యక్రియలకు వెళ్లి వస్తూ అనంతలోకాలకు!

image

కర్నూలు జిల్లా ఆదోని మండలం విరుపాపురం గ్రామ సమీపంలో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. స్థానికుల వివరాల మేరకు.. ఈ ఘటనలో నాగరాజు అనే వ్యక్తి మృతి చెందాడు. అతడి భర్య వాణి, మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. మృతుడు గూడూరు మండలం రేమట గ్రామానికి చెందిన వారు. వారి బాబాయ్ అంత్యక్రియలకు వచ్చి తిరిగి, రేమట గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని బంధువులు తెలిపారు. నాగరాజుకు ఇద్దరు సంతానం.