News February 23, 2025
కర్నూలు జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-2 పరీక్షలు

కర్నూలు జిల్లాలో 30 కేంద్రాలలో నిర్వహించిన గ్రూప్-2 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని కలెక్టర్ రంజిత్ బాషా పేర్కొన్నారు. ఉదయం పేపర్-1 పరీక్షలకు 9,993 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 8,693 మంది, మధ్యాహ్నం పేపర్-2 పరీక్షలకు 9,993 మంది హాజరు కావాల్సి ఉండగా 8,678 మంది హాజరయ్యారని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయన్నారు.
Similar News
News March 18, 2025
కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

➤ఆదోనిలో ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ సందడి
➤ ఓర్వకల్ ఎయిర్పోర్ట్ కు ఉయ్యాలవాడ పేరు పెట్టాలని వినతి
➤ ఆదోనిలో మృతదేహంతో ఆందోళన
➤ క్లస్టర్ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వీసీగా బసవరావు
➤ పదో తరగతి పరీక్షలు.. తొలిరోజే ఇద్దరు డిబార్
➤ పెద్దకడబూరు: ‘భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి’
➤ ఆదోని సమస్యలపై ఎమ్మెల్యే పార్థసారథి అసెంబ్లీలో గళం
News March 17, 2025
కర్నూలు జిల్లాలో తొలిరోజే ఇద్దరు డీబార్

కర్నూలు జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు సోమవారం మొదలయ్యాయి. మొదటి రోజే తెలుగు పరీక్షకు 700 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జొన్నగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చూచిరాతకు పాల్పడిన ఓ విద్యార్థిని ఆర్జెడీ డీబార్ చేశారు. కర్నూలు సీఆర్ఆర్ మున్సిపల్ పాఠశాలలో చూచిరాతకు పాల్పడిన విద్యార్థిని డీఈవో శామ్యూల్ పాల్ గుర్తించారు. ఆ విద్యార్థిని సైతం డీబార్ చేయగా.. జొన్నగిరిలో టీచర్‌ను సస్పెండ్ చేశారు.
News March 17, 2025
ఉయ్యాలవాడ పేరు పెట్టాలని వినతి

ఓర్వకల్ విమానాశ్రయానికి స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టాలని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కోరారు. ఈ మేరకు కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఉయ్యాలవాడ పేరు పెట్టాలంటూ వినతి పత్రాన్ని అందజేశారు. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని ఎంపీ తెలిపారు.