News December 4, 2024
కర్నూలు జిల్లాలో భూప్రకంపనల ప్రభావం లేదు!
తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు కలకలం సృష్టించాయి. తెలంగాణతో పాటు విజయవాడ, జగ్గయ్యపేట, నందిగామ తదితర ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ భూ ప్రకంపనల ప్రభావం కర్నూలు జిల్లాపై లేదు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఏడాది క్రితం జిల్లాలోని రాతన గ్రామం కురువ గేరిలో భూమి కంపించిన విషయం తెలిసిందే. దీని ప్రభావానికి అప్పట్లో 12ఇళ్లు బీటలు వారాయి.
Similar News
News January 19, 2025
‘రాయలసీమ వనరుల వినియోగానికి సహకరించండి’
రాయలసీమ వనరుల వినియోగానికి కూటమి ప్రభుత్వం సహకరించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథ రామిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నంద్యాలలోని వివేకానంద ఆడిటోరియంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం తక్షణమే పెండింగ్లో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
News January 19, 2025
కర్నూలు: ఘనంగా వేమన జయంతి
యువత వేమన పద్యాల సారాంశాన్ని పాటించి అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా అన్నారు. ఆదివారం కర్నూలు కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో యోగి వేమన జయంతిని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.
News January 19, 2025
తిక్కారెడ్డి సంచలన కామెంట్స్
టీడీపీ ఎమ్మెల్యేలు పదవులు అమ్ముకుంటున్నారంటూ కర్నూలు <<15188222>>జిల్లా <<>>టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయావర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు రూ.5లక్షలకు డీలర్‌షిప్‌లు, నామినేటెడ్ పోస్టులను అమ్ముకుంటున్నారంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు. వీరి అవినీతి వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై మీరేమంటారు.. కామెంట్ చేయండి.