News February 18, 2025

కర్నూలు జిల్లాలో మండే ఎండలు.. జాగ్రత్త!

image

జిల్లాలో రోజురోజుకు పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఫిబ్రవరిలోనే కర్నూలులో ఆదివారం, సోమవారం వరుసగా 38.2, 38°C ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ఈ ఎండల్లో మంచినీళ్లతో పాటు తరచుగా ఇతర ద్రవపదార్థాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు తీసుకోవాలని, కాస్త వదులుగా ఉండే కాటన్‌ దుస్తులు ధరించడం బెటర్ అని నిపుణులు చెబుతున్నారు.

Similar News

News April 19, 2026

ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ ఘటన

image

ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. భార్య నరసమ్మపై భర్త రామయ్య కత్తితో దాడి చేశాడు. కొంతకాలంగా దూరంగా ఉంటున్న ఈ దంపతులు, కూతురు శాంతి ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది. సమాచారం తెలుసుకొని ఆసుపత్రికి వచ్చిన రామయ్య నరసమ్మపై దాడి చేయగా.. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. పోలీసులు రామయ్యను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.

News April 19, 2026

కర్నూలు జిల్లాలో ఆ విద్యార్థులకు గుడ్ న్యూస్

image

ఇంటర్ ఫలితాల్లో కర్నూలు జిల్లా రాష్ట్రంలో ఫస్టియర్ ఫలితాల్లో 14వ స్థానం, సెకండియర్‌లో ఎనిమిదో స్థానం నిలిచిన విషయం తెలిసిందే. ఫస్టియర్‌లో 22,477 మందికి 16,356 మంది పాసయ్యారు. సెకండియర్‌లో 18,999 మందికి 16,077 మంది పాసయ్యారు. 2,922 మంది ఫెయిలయ్యారు. సెకండియర్‌కు సైతం ఇంఫ్రూమెంట్ రాసే అవకాశం ఉండటంతో ఫెయిల్ అయిన వారితో పాటు పాసైన వారూ మరోసారి పరీక్ష రాయవచ్చు. మే 21 నుంచి జూన్ 4 వరకు పరీక్షలు ఉంటాయి.

News April 18, 2026

భూగర్భ జలాల పెంచడమే లక్ష్యం: కలెక్టర్

image

భూగర్భ జలాలు పెంచడమే లక్ష్యమని కలెక్టర్ సిరి పేర్కొన్నారు. శనివారం కోడుమూరు మండలం ఆమడగుంట్లలో నీటి భద్రత, జల ధార జల హారతి కార్యక్రమం నిర్వహించారు. వంకలను, వాగులను, చెరువులను గుర్తించి వాటికి మరమ్మత్ పనులు చేపట్టి నీరు నింపుతామన్నారు. తద్వారా భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందన్నారు. నీటిని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో పీడీ నరసింహారెడ్డి పాల్గొన్నారు.