News October 15, 2024
కర్నూలు జిల్లాలో మద్యం లాటరీ విచిత్రాలు

➤ కర్నూలుకు చెందిన ఓ నేత అనుచరులు 246 దరఖాస్తులు చేయగా ఒక్క దుకాణాం కూడా దక్కలేదు
➤ గతంలో గుమస్తాగా పనిచేసిన ప్రతాప్‌కు ఓర్వకల్లు మండలంలోని దుకాణం
➤ నాగలాపురంలో ఒక దుకాణానికి 99 మంది పోటీ.. విజేతగా లక్ష్మీదేవి
➤ అంబమ్మ, అనిత అనే అత్తాకోడళ్లకు రెండు దుకాణాలు
➤ ఎస్పీవై రెడ్డి కుమార్తె సుజల 9కిపైగా దుకాణాలు కైవసం
☛ కర్నూలు జిల్లాలో 99 షాపులకు గానూ 10 మహిళలకు
☛ నంద్యాల జిల్లాలో 105కు గానూ 6 మహిళలకు
Similar News
News February 23, 2026
ప్రజా ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటాం: SP

పోలీస్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు మొత్తం 122 ఫిర్యాదులు అందాయని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వినతులను స్వీకరించిన ఎస్పీ, ప్రతి ఫిర్యాదుపై చట్టపరంగా విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. విచారణ జరిపి న్యాయం చేస్తామని, ఉద్యోగాల పేరుతో డబ్బులు తీసుకుని మోసం చేసిన ఘటనలు, ఫైనాన్స్ మోసాలు, బంగారు దుకాణ వివాదం వంటి ఫిర్యాదులు వచ్చాయన్నారు.
News February 23, 2026
ఇంటర్ పరీక్ష.. తొలిరోజు 823 మంది గైర్హాజరు: RIO

కర్నూలు జిల్లా వ్యాప్తంగా సోమవారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలకు 823 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి (RIO) లాలప్ప తెలిపారు. 26,925 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా, 26,102 మంది మాత్రమే హాజరయ్యారని వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని, పరీక్షలు అత్యంత ప్రశాంత వాతావరణంలో జరిగాయని ఆయన స్పష్టం చేశారు.
News February 23, 2026
కర్నూలు జిల్లాలో రైతులకు పుష్కలంగా యూరియా నిల్వలు

కర్నూలు జిల్లాలో సాగు అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి తెలిపారు. 2025-26 రబీ సీజన్ కోసం 24,580 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని ప్రణాళిక సిద్ధం చేశారు. యూరియాను అధిక ధరలకు అమ్మినా, ఇతర ప్రాంతాలకు తరలించినా డీలర్ల లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఎరువుల కొరతపై ఫిర్యాదుల కోసం 8341302863 నంబర్‌ను సంప్రదించాలని ఆమె సూచించారు.


