News October 12, 2024
కర్నూలు జిల్లాలో మద్యం షాపులకు 5,128 దరఖాస్తులు

కర్నూలు జిల్లా వ్యాప్తంగా మద్యం షాపులకు దరఖాస్తు గడువు శుక్రవారం రాత్రి 7 గంటలకు ముగిసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 5,128 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. కర్నూలు జిల్లాలో 99 దుకాణాలకు 3,013 దరఖాస్తులు రాగా, నంద్యాల జిల్లాలో 105 దుకాణాలకు 2,115 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 14న కర్నూలు జడ్పీ సమావేశ హాల్లో లక్కీ డిప్ తీయనున్నారు.
Similar News
News November 27, 2025
విద్యార్థులతో కర్నూలు కలెక్టర్ మాటామంతి

రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని కర్నూలు కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి బుధవారం కార్యాలయ ఛాంబర్లో మాక్ అసెంబ్లీకి ఎంపికైన విద్యార్థులతో మాటామంతి నిర్వహించారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం రక్షణపై పలు ప్రశ్నలు అడిగి విద్యార్థుల అవగాహనను పరిశీలించారు. విద్యార్థుల పాఠశాల సమస్యలు, పాఠ్యాంశాల బోధన, 10వ తరగతి పరీక్షలకు సిద్ధత వంటి అంశాలపై సూచనలు ఇచ్చారు. ధైర్యంగా సమాధానాలిచ్చిన విద్యార్థులను అభినందించారు.
News November 26, 2025
కలెక్టర్ను మైమరిపించిన ఓర్వకల్లు మహిళా రైతు

ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడలో ప్రకృతి వ్యవసాయంతో ఆదర్శంగా నిలుస్తున్న మహిళా రైతు రాజకుమారిని కలెక్టర్ డా. ఏ. సిరి ప్రశంసించారు. బుధవారం రాజకుమారి పొలంను కలెక్టర్ పరిశీలించి పంటల సాగు వివరాలు అడిగి తెలుసుకున్నారు. 70 సెంట్ల భూమిలో అంతర పంటల పద్ధతిలో కందులు, అలసందలు, సజ్జలు, మినుములు, గోరు చిక్కుడు, ఆకుకూరలు సాగు చేసి రూ.5 వేల పెట్టుబడితో రూ.60 వేల లాభం సాధించినట్లు రాజకుమారి వివరించారు.
News November 26, 2025
విభిన్న ప్రతిభావంతులు రాణించాలి: డీఈఓ

విభిన్న ప్రతిభావంతులు తాము ఎంచుకున్న రంగంలో ఏకాగ్రతతో సాధన చేసి రాణించాలని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు అన్నారు. బుధవారం కర్నూల్ అవుట్డోర్ స్టేడియంలో విభిన్న ప్రతిభావంతులకు క్రీడా పోటీలు నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. సమన్వయంతో క్రీడాస్ఫూర్తి ప్రదర్శించి, విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు.


