News November 15, 2024
కర్నూలు: జిల్లాలో రోడ్డు భద్రత చర్యలపై దృష్టి సారించాలి: కలెక్టర్, ఎస్పీ

కర్నూలు కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం జిల్లా రోడ్ల భద్రత చర్యలపై కమిటీ సమావేశంను జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, ఎస్పీ జి. బిందు మాధవ్ ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. జిల్లాలో రోడ్డు భద్రత నియమాలు పాటించే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టరు, ఎస్పీ అధికారులకు సూచించారు.
Similar News
News September 15, 2025
ఉద్యోగాల పేరుతో మోసపోకండి: కర్నూలు SP

ఉద్యోగుల పేరుతో నిరుద్యోగులు మోసపోవద్దని.. పోటీ పరీక్షల ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు వస్తాయని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్పష్టం చేశారు. ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి 81 ఫిర్యాదులు వచ్చాయన్నారు. వాటిని త్వరగా పరిష్కరిస్తామన్నారు. అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా తదితరులు ఉన్నారు.
News September 15, 2025
నిజంగా రూ.1200కు ఉల్లి కొన్నారా?: SV

చంద్రబాబు సర్కారుకు ఉల్లి రైతుల కష్టాలు కనిపించవా? అని వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. కర్నూలు ఎస్వీ కాంప్లెక్స్లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం నిజంగా రూ.1,200తో ఉల్లిని కొనుగోలు చేస్తే రైతులు ఎందుకు రోడ్లపై పడేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి అధ్వానంగా ఉందని, వారికి మద్దతుగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
News September 14, 2025
కర్నూలు: ‘ప్రతి ఒక్కరు వ్యాయామం చేయాలి’

ప్రతి ఒక్కరు వ్యాయామాలు చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు కర్నూలులోని కొండారెడ్డి బురుజు వద్ద ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ‘సండేస్ ఆన్ సైక్లింగ్’ కార్యక్రమాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. సైక్లింగ్ వల్ల పర్యావరణానికి ముప్పు ఉండదని, ప్రతి ఆదివారం పోలీసులు సైకిల్ తొక్కాలని పిలుపునిచ్చారు.