News August 26, 2024
కర్నూలు జిల్లాలో వైరల్ ఫీవర్లు

కర్నూలు జిల్లాలో వైరల్ ఫీవర్లతో పెద్దలు, పిల్లలు అని తేడా లేకుండా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల బాట పడుతున్నారు. కర్నూలు అర్బన్లో 63కేసులు, దేవనకొండలో 14, సి.బెళగల్లో 13తో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో 211 డెంగీ కేసులు నమోదైనట్లు సమాచారం. దీంతో పాటు మలేరియా జ్వరాలూ పెరగడం కలవరపెడుతోంది. జిల్లాలో దోమల వ్యాప్తి పెరగకుండా చర్యలు తీసుకుంటున్నామని కర్నూలు మలేరియా అధికారి నూకరాజు తెలిపారు.
Similar News
News October 16, 2025
కర్నూలుకు వస్తున్నా.. తెలుగులో మోదీ ట్వీట్

ప్రధాని నరేంద్ర <<18018303>>మోదీ<<>> తన ఆంధ్రప్రదేశ్ పర్యటనపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. నేడు శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకొని, అనంతరం కర్నూలులో రూ.13,400 కోట్ల విలువైన అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొంటానని తెలిపారు. విద్యుత్, రైల్వేలు, పెట్రోలియం, రక్షణ, పరిశ్రమల వంటి పలు రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులు ఈ పర్యటనలో భాగమని పేర్కొన్నారు.
News October 16, 2025
రూ.13,429 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు

కర్నూలు జిల్లాలో ప్రధాని మోదీ భారీ ఎత్తున ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలను చేపట్టనున్నారు. మొత్తంగా రూ.13,429 కోట్ల మేర అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం చుట్టనున్నారు. వీటిల్లో రూ.9,449 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు చేయనుండగా.. రూ.1,704 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. రూ.2,276 కోట్ల విలువైన ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు.
News October 15, 2025
ఇండస్ట్రీ పార్టనర్షిప్ డ్రైవ్ పోస్టర్లను ప్రారంభించిన మంత్రులు

కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కర్నూలులో బుధవారం ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(APIIC) నిర్వహించిన ఇండస్ట్రీ పార్టనర్షిప్ డ్రైవ్ పోస్టర్లను రాష్ట్ర మంత్రులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, జిల్లా అధికారులు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.