News April 25, 2024
కర్నూలు జిల్లాలో 180 నామినేషన్లు దాఖలు
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కర్నూలు జిల్లాలో నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. తొలి రోజు నుంచి నేటి వరకు జిల్లాలోని పార్లమెంట్‌తో పాటు 8 నియోజకవర్గాలకు 180 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు తెలిపారు. పాణ్యం, కర్నూలు, కోడుమూరు, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాలకు సంబంధించి 161 మంది అభ్యర్థులు 180 నామినేషన్ పత్రాలను అందజేశారన్నారు.
Similar News
News January 26, 2025
కానిస్టేబుల్ అభ్యర్థులకు కర్నూలు జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీ శుభవార్త
కానిస్టేబుల్ అభ్యర్థులకు కర్నూలు జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా శుభవార్త చెప్పారు. కానిస్టేబుల్ ఈవెంట్స్‌కు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు గైర్హాజరైన అభ్యర్థులు ఈనెల 27న హాజరుకావాలని పిలుపునిచ్చారు. నిబంధనల ప్రకారం అభ్యర్థులు ఒరిజినల్, జిరాక్స్ ధ్రువపత్రాలను తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. 28వ తేదీతో అభ్యర్థుల దేహదారుడ్య పరీక్షలు ముగుస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు.
News January 26, 2025
కర్నూలు: ‘ఆ హత్య దారుణం’
ఆలూరు మండలం అరికెర గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ హత్య అత్యంత అమానుషమైన చర్య అని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బీ.వీరశేఖర్ అన్నారు. దేవనకొండలో ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని, ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాలలో ఫ్యాక్షన్ నుంచి సామాన్య ప్రజానీకం ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని, ఇలా హత్యలు చేయడం తగదని అన్నారు.
News January 26, 2025
టికే ఆర్ శర్మ సేవలు చిరస్మరణీయం: డీవీఆర్
గాంధీయవాది టీకేఆర్ శర్మ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని క్లస్టర్ యూనివర్సిటీ ఉపకులపతి డీవీఆర్ సాయి గోపాల్ అన్నారు. శనివారం యూనివర్సిటీ ప్రాంగణంలో టీకేఆర్ శర్మ శతజయంతి ఉత్సవాల బ్రోచర్లను ఆయన విడుదల చేశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. శత జయంతి ఉత్సవాలను ఈనెల 30న కర్నూలులోని కేవీఆర్ కళాశాల ప్రాంగణంలో గాడిచర్ల ఫౌండేషన్, సాహితీ సదస్సు సంస్థ సంయుక్తా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు.