News July 20, 2024
కర్నూలు జిల్లాలో 21 మండలాల్లో వర్షం

అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు 21 మండలాల్లో వర్షం కురిసింది. దేవనకొండలో అత్యధికంగా 22.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదోని 16.2, పత్తికొండ 8.0, క్రిష్ణగిరి 6.6, అస్పరి 6.2, మద్దికెర 5.6, కౌతలం 4.2, గోనెగండ్ల 3.8, తుగ్గలి 3.4, కర్నూలు అర్బన్ 0.8, సి.బెళగల్లో 0.2 మి మీ వర్షం కురిసింది. జిల్లాలో సగటున 3.8 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
Similar News
News November 14, 2025
పాఠశాలల్లో డ్రాపౌట్లు ఉండకూడదు: కలెక్టర్ సిరి

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు డ్రాపౌట్లు కాకుండా చూడాలని, పిల్లలను వలసలకు తీసుకెళ్లే తల్లిదండ్రులతో మాట్లాడి ఒప్పించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి విద్యా శాఖాధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో డీఈఓ, ఎంఈఓలతో నిర్వహించిన సమీక్షలో ఆమె ఈ ఆదేశాలు ఇచ్చారు. పశ్చిమ ప్రాంతంలో ఈ సమస్యపై దృష్టి సారించాలని సూచించారు.
News November 14, 2025
చెత్త సేకరణ సక్రమంగా జరగాలి: కర్నూలు కలెక్టర్

గ్రామాల్లో ఇంటింటి చెత్త సేకరణ సక్రమంగా జరగాలని కర్నూలు కలెక్టర్ డా.ఎ.సిరి అధికారులను ఆదేశించారు. కోసిగి, ఆదోని, ఎమ్మిగనూరు మండలాలు చెత్త సేకరణలో చివరి స్థానాల్లో ఉన్నాయని, వెంటనే మెరుగుపరచాలని సూచించారు. జిల్లాలో నిర్మాణంలో ఉన్న 63 సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్లను త్వరగా పూర్తి చేయాలని, తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు.
News November 13, 2025
కర్నూలు ఆర్టీసీ బస్టాండ్లో విస్తృత తనిఖీలు

ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో కర్నూలు ఆర్టీసీ బస్టాండ్లో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు డీఎస్పీ జె.బాబు ప్రసాద్ నేతృత్వంలో ఈ తనిఖీలు జరిగాయి. సీఐలు, ఎస్సై, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు. బస్టాండ్లో అనుమానిత వ్యక్తులు, వాహనాలు, పార్సిల్ కార్యాలయాలను పోలీసులు పరిశీలించారు.


