News February 23, 2025
కర్నూలు జిల్లాలో 30 కేంద్రాల్లో గ్రూప్-2 పరీక్ష

గ్రూప్-2 వాయిదా వేయాలంటూ ప్రభుత్వ చేసిన విజ్ఞప్తిని APPSC తిరస్కరించడంతో నేడు పరీక్షలు యథావిధిగా జరగనున్నాయి. కర్నూలు జిల్లాలో 30 కేంద్రాల్లో 9,993 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు పేపర్-1, మ.3 గంటలకు పేపర్-2 పరీక్ష జరగనుంది. అభ్యర్థులు 15 నిమిషాలు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు తెలిపారు.
Similar News
News February 23, 2025
కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

➤ కర్నూలు జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-2 పరీక్షలు ➤ ఆదోనిలో ఘోరం.. బాలుడిపైకి దూసుకెళ్లిన లారీ ➤ మంత్రాలయం శ్రీ మఠంలో ఆకట్టుకున్న భరతనాట్యం ➤ ఎమ్మిగనూరు ఎస్ఎంఎల్ కాలేజీలో 25న జాబ్ మేళా ➤ జిల్లాలో చికెన్కు తగ్గిన డిమాండ్ ➤ రూ.1.15 లక్షల కర్ణాటక మద్యం స్వాధీనం ➤ జిల్లాలోని ఆలయాల్లో మొదలైన మహా శివరాత్రి సందడి
News February 23, 2025
కర్నూలు జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-2 పరీక్షలు

కర్నూలు జిల్లాలో 30 కేంద్రాలలో నిర్వహించిన గ్రూప్-2 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని కలెక్టర్ రంజిత్ బాషా పేర్కొన్నారు. ఉదయం పేపర్-1 పరీక్షలకు 9,993 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 8,693 మంది, మధ్యాహ్నం పేపర్-2 పరీక్షలకు 9,993 మంది హాజరు కావాల్సి ఉండగా 8,678 మంది హాజరయ్యారని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయన్నారు.
News February 23, 2025
కర్నూలు జిల్లాలో కిలో చికెన్ ఎంతంటే?

బర్డ్ ఫ్లూ భయంతో చికెన్కు డిమాండ్ తగ్గింది. ఎక్కువ మంది నాటుకోడి, మటన్ కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఇవాళ కిలో చికెన్ రూ.180-200 పలుకుతోంది. నాటుకోడి కిలో రూ.400, మటన్ కిలో రూ.750-800లతో విక్రయాలు సాగుతున్నాయి. జిల్లాలోని అన్ని మండలాల్లో దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి.