News February 23, 2025
కర్నూలు జిల్లాలో 30 కేంద్రాల్లో గ్రూప్-2 పరీక్ష

గ్రూప్-2 వాయిదా వేయాలంటూ ప్రభుత్వ చేసిన విజ్ఞప్తిని APPSC తిరస్కరించడంతో నేడు పరీక్షలు యథావిధిగా జరగనున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 30 కేంద్రాల్లో 9,993 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు పేపర్-1, మ.3 గంటలకు పేపర్-2 పరీక్ష జరగనుంది. అభ్యర్థులు 15 నిమిషాలు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు తెలిపారు.
Similar News
News March 21, 2025
రాజమండ్రిలో అధికారుల మెరుపు దాడులు

తూర్పుగోదావరి జిల్లాలో ఈగల్ టీం శుక్రవారం మెరుపు దాడులు చేసింది. పలు మెడికల్ షాపుల్లో తనిఖీలు చేసింది. రాష్ట్రంలోని యువత మత్తు పదార్థాలను ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటున్నట్లు సమాచారం ఉండటంతో దాడులు నిర్వహించామని విజిలెన్స్ అధికారి ఎం.స్నేహిత, డ్రగ్స్ ఏడీ నాగమణి తెలిపారు. రాజమండ్రి గణేశ్ చౌక్ వద్ద ఉన్న ఓ మెడికల్ ఏజెన్సీలో ట్రెమడల్ మెడిసిన్ స్వాధీనం చేసుకున్నారు.
News March 21, 2025
మహబూబ్‌నగర్: మతసామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు: ఎమ్మెల్యే

పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత,మత సామరస్యానికి ప్రతీక అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం MBNRలోని జేజేఆర్ ఫంక్షన్ హాలులో జాఫర్ ఉల్లా సిద్దిక్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లిం సోదరులకు ఫలహారాలు తినిపించి ఉపవాస దీక్ష విరమింపజేశారు.
News March 21, 2025
తాడిపత్రిలో ఉద్రిక్తత

AP: అనంతపురం(D) తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. YCP నేత ఫయాజ్ బాషా ఇల్లు అక్రమ నిర్మాణమనే ఆరోపణతో మున్సిపల్ అధికారులు జేసీబీతో తరలివచ్చారు. దానివెంట టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వందలాది మంది అనుచరులతో వచ్చారు. ఈ క్రమంలో ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. వైసీపీ శ్రేణులూ భారీగా వచ్చి ఎదురుదాడి చేయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.