News March 3, 2025
కర్నూలు జిల్లాలో 336 మంది గైర్హాజరు

కర్నూలు జిల్లా వ్యాప్తంగా 69 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్ పేపర్2 పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు జిల్లాలో 336 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు RIO గురవయ్య శెట్టి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 20,506 విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 20,160 మంది హాజరయ్యారని అన్నారు. పత్తికొండ జీజేసీలో ఆరుగురు, మిగతా కళాశాలల్లో నలుగురిపై నలుగురిపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి.
Similar News
News March 4, 2025
రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వీడాలి: సీపీఎం

దేవనకొండ మండలంలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య ధోరణిపై సీపీఎం నాయకుడు బీ.వీరశేఖర్ తహశీల్దార్ కార్యాలయంలో బైఠాయించారు. తెర్నేకల్ గ్రామానికి చెందిన మాబాషా అనే రైతుకు 7 ఎకరాల వ్యవసాయ పొలంలో 27 సెంట్లు హంద్రీనీవా కాలువ కింద పోయిందని, మిగిలిన 6 ఎకరాల 63 సెంట్లు పట్టాదారు పాసు బుక్కులో ఎక్కించాల్సి ఉండగా రీ సర్వే పేరుతో ఆలస్యం చేస్తున్నారనిధ్వజమెత్తారు.
News March 4, 2025
నాటుసారాను సమూలంగా నిర్మూలించాలి: కలెక్టర్

కర్నూలు జిల్లాలో నాటుసారాను పూర్తిగా నిర్మూలించాలని కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. కర్నూలు కలెక్టరేట్లో జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నాటుసారా నిర్మూలన కార్యక్రమం నవోదయం-2.0పై రూపొందించిన పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డీఆర్ వెంకట నారాయణమ్మ, జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుధీర్ కుమార్ పాల్గొన్నారు.
News March 3, 2025
శ్రీలేఖ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి లోకేశ్

కర్నూలు జిల్లా సీ.బెళగల్ మండలం పోలకల్ జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో చెట్టు విరిగిపడిన ఘటనలో కిత్స పొందుతూ 8వ తరగతి విద్యార్థిని శ్రీలేఖ(14) మృతి చెందడంపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ‘ఈ ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. చిన్నారి శ్రీలేఖ మృతితో ఆమె తల్లిదండ్రులకు కలిగిన నష్టం తీర్చలేనిది. శ్రీలేఖ కుటుంబానికి ప్రభుత్వం అన్నివిధాలా అండగా నిలుస్తుంది’ అని ట్వీట్ చేశారు.