News March 15, 2025
కర్నూలు జిల్లాలో 393 మంది గైర్హాజరు

కర్నూలు జిల్లా వ్యాప్తంగా శనివారం జరిగిన ఇంటర్మీడియట్ రెండో సంవత్సర పరీక్షకు 393 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి గురువయ్య శెట్టి తెలిపారు.19,182 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 393 విద్యార్థులు హాజరు కాలేదన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎలాంటి మల్ ప్రాక్టీస్ ఘటనలు చోటు చేసుకోలేదని ఆర్ఐఓ స్పష్టం చేశారు.
Similar News
News March 16, 2025
పది విద్యార్థులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం

ఈ నెల 17 నుంచి 31వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు ఆదోని ఆర్టీసీ డిపో మేనేజర్ రఫిక్ వెల్లడించారు. విద్యార్థులు ఆర్టీసీ బస్సు కండక్టర్లకు హాల్ టికెట్ చూపించి, 14 రోజుల పాటు ఉచితంగా ప్రయాణించే వెసలుబాటు కల్పించామన్నారు. పరీక్షలు రాసే విద్యార్థులు ఉచిత బస్సు ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News March 16, 2025
జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిద్దాం: స్పెషల్ ఆఫీసర్

జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిద్దామని జిల్లా ఇన్‌ఛార్జ్ ఆఫీసర్, రహదారులు, భవనాలు, రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే పేర్కొన్నారు. శనివారం కర్నూలు కలెక్టరేట్లో కలెక్టర్ రంజిత్ బాషా అధ్యక్షతన జిల్లా అభివృద్ధిపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో పేదరిక నిర్మూలన, ఎంఎస్ఎంఈల ఏర్పాటు, విద్య, వైద్య రంగాల అభివృద్ధి, నీటి వనరుల వినియోగం అంశాలపై దృష్టి సారిస్తామన్నారు.
News March 15, 2025
కర్నూలులో హత్య.. పాత కక్షలే కారణమా?

కర్నూలులో TDP నేత సంజన్న <<15763975>>హత్య<<>> కలకలం రేపింది. శరీన్‌నగర్‌లో ఉంటున్న సంజన్నకు స్థానికంగా అంజితో ఆధిపత్యపోరు ఉంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఇంటికి వెళ్తున్న సంజన్నపై దండగులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. విషయం తెలుసుకున్న సంజన్న వర్గీయులు ఆంజి వాహనంపై దాడికి పాల్పడటంతో ఉద్రిక్తత నెలకొంది. అంజి వర్గీయులే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.