News April 1, 2025
కర్నూలు జిల్లాలో 54.35% పింఛన్ల పంపిణీ@9Am.!

కర్నూలు జిల్లాలో ఏప్రిల్ నెలకు సంబంధించి మంగళవారం ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ప్రభుత్వం ఆదేశాలతో ఉదయం 7 గంటల నుంచే ఈ కార్యక్రమం ప్రారంభం కాగా.. ఉదయం 9 గంటలకు జిల్లాలో 54.35% పింఛన్ల పంపిణీ పూర్తయింది. ఇప్పటివరకు జిల్లాలో 2,38,302 మందికి గానూ 1,29,522 మందికి సచివాలయ ఉద్యోగులు పింఛన్ సొమ్మును అందజేశారు.
Similar News
News April 6, 2025
కోడుమూరు: యువకుడిపై పోక్సో కేసు

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన బాలికను నమ్మించి, మోసం చేసిన యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. కర్నూలు జిల్లా కోడుమూరుకు చెందిన రామాంజనేయులు అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన బాలికకు ఇన్‌స్టాలో పరిచయమయ్యాడు. ఆమెను మాయమాటలతో నమ్మించి, మోసం చేశాడు. తీరా ముఖం చాటేయడంతో బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తాడిపత్రి టౌన్ సీఐ సాయి ప్రసాద్ పేర్కొన్నారు.
News April 5, 2025
కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

➤కోసిగి: పేకాటరాయుళ్ల అరెస్ట్.. రూ.24,550లు స్వాధీనం➤ ఆదోని మార్కెట్లో పెరిగిన పత్తి ధర.!➤ జగ్జీవన్ రామ్ జీవితం అనుసరణీయం: జేసీ➤ విలువలతో కూడిన విద్యను అందించాలి: టీజీ వెంకటేశ్➤ సీఎం చంద్రబాబు నమ్మకద్రోహం చేశారు: హఫీజ్ ఖాన్➤ వర్ఫ్ బోర్డ్ బిల్లుకు రద్దు చేయాలని జిల్లా వ్యాప్తంగా నిరసనలు➤ కర్నూలు: 10th విద్యార్థులకు ఉచిత కోచింగ్➤ ఎమ్మిగనూరు: పొలాల్లోకి దూసుకెళ్లిన కారు
News April 5, 2025
కర్నూలు: 10th విద్యార్థులకు ఉచిత కోచింగ్

కర్నూలు జిల్లా 10th విద్యార్థులకు శుభవార్త. పదో తరగతి పరీక్షలు కంప్లీట్ అయిన విద్యార్థులకు తాండ్రుపాడు ప్రభుత్వ మైనారిటీ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్ ప్రవేశానికి ఉచిత కోచింగ్ ఇవ్వనున్నారు. శుక్రవారం నుంచి ఈనెల 28 వరకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ చక్రవర్తి తెలిపారు. శిక్షణకు వచ్చే విద్యార్థులకు స్టడీ మెటీరియల్ కూడా ఇస్తామన్నారు. వివరాలకు తాండ్రుపాడు కళాశాలను సంప్రదించాలన్నారు.