News March 8, 2025
కర్నూలు జిల్లాలో 610 మంది విద్యార్థుల గైర్హాజరు

కర్నూలు జిల్లా వ్యాప్తంగా నేడు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు మ్యాథ్స్ పేపర్ 1బి, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 పరీక్షలు జరిగాయి. 610 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి గురువయ్య శెట్టి తెలిపారు. 22,348 మంది హాజరు కావాల్సి ఉండగా 21,738 మంది పరీక్ష రాశారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ ఘటనలు చోటు చేసుకోలేదని ఆయన తెలిపారు.
Similar News
News November 23, 2025
రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో కర్నూలుకు పతకాలు

ఈ నెల 15, 16వ తేదీల్లో కాకినాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో కర్నూలు క్రీడాకారులు 2 బంగారు, ఒక రజితం, 10 కాంస్య పతకాలు సాధించినట్లు తైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఆదివారం కర్నూలు శరీన్ నగర్లోని వెంకటేష్ తైక్వాండో అకాడమీలో పతకాలు సాధించిన క్రీడాకారులను జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి జి.శ్రీనివాసులు అభినందించారు. జాతీయ స్థాయిలోనూ రాణించాలన్నారు.
News November 23, 2025
సీమ అభివృద్ధికి సత్య సాయిబాబా కృషి: కలెక్టర్

కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు ఆదివారం నిర్వహించారు. వేడుకల్లో కర్నూలు ఎంపీ నాగరాజు, కలెక్టర్ డా.ఏ.సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. సత్య సాయిబాబా రాయలసీమ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారని కొనియాడారు.
News November 23, 2025
అదే మా లక్ష్యం: కర్నూలు ఎస్పీ

రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా ప్రతి శనివారం రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పోలీసు అధికారులకు ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. హెల్మెట్ తప్పనిసరి, ఓవర్స్పీడ్–ఓవర్లోడ్ నిషేధం, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయరాదని ప్రజలకు సూచించారు. మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా పోలీసు స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు.


