News July 15, 2024
కర్నూలు జిల్లాలో 72 పోస్టల్ ఉద్యోగాలు

పదో తరగతి అర్హతతో BPM/ABPM ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. కర్నూలు డివిజన్లో 37, నంద్యాల డివిజన్లో 35 పోస్టులను పోస్టల్ డిపార్ట్మెంట్ భర్తీ చేయనుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఎంపికైన వారికి బీపీఎం అయితే రూ.12 వేలు+అలవెన్సులు, ఏబీపీఎం అయితే రూ.10 వేలు+అలవెన్సులు జీతంగా ఇవ్వనున్నారు. పూర్తి వివరాలకు https://indiapostgdsonline.gov.in వెబ్సైట్ను సంప్రదించవచ్చు. SHARE IT
Similar News
News November 14, 2025
చెత్త సేకరణ సక్రమంగా జరగాలి: కర్నూలు కలెక్టర్

గ్రామాల్లో ఇంటింటి చెత్త సేకరణ సక్రమంగా జరగాలని కర్నూలు కలెక్టర్ డా.ఎ.సిరి అధికారులను ఆదేశించారు. కోసిగి, ఆదోని, ఎమ్మిగనూరు మండలాలు చెత్త సేకరణలో చివరి స్థానాల్లో ఉన్నాయని, వెంటనే మెరుగుపరచాలని సూచించారు. జిల్లాలో నిర్మాణంలో ఉన్న 63 సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్లను త్వరగా పూర్తి చేయాలని, తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు.
News November 13, 2025
కర్నూలు ఆర్టీసీ బస్టాండ్లో విస్తృత తనిఖీలు

ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో కర్నూలు ఆర్టీసీ బస్టాండ్లో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు డీఎస్పీ జె.బాబు ప్రసాద్ నేతృత్వంలో ఈ తనిఖీలు జరిగాయి. సీఐలు, ఎస్సై, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు. బస్టాండ్లో అనుమానిత వ్యక్తులు, వాహనాలు, పార్సిల్ కార్యాలయాలను పోలీసులు పరిశీలించారు.
News November 13, 2025
వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ దరఖాస్తుల ఆహ్వానం

కర్నూలు జిల్లాలో పనిచేస్తున్న పాత్రికేయులకు 2026-27కు అక్రిడిటేషన్ కార్డుల జారీకి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు జిల్లా సమాచార అధికారి కె.జయమ్మ తెలిపారు. గత అక్రిడిటేషన్ కార్డుల గడువు ఈనెల 30తో ముగుస్తుందన్నారు. కొత్త దరఖాస్తులు రేపటి నుంచి https://mediarelations.ap.gov.in వెబ్సైట్లో ఆన్లైన్లో సమర్పించాలని సూచించారు.


