News July 15, 2024
కర్నూలు జిల్లాలో 72 పోస్టల్ ఉద్యోగాలు
పదో తరగతి అర్హతతో BPM/ABPM ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. కర్నూలు డివిజన్‌లో 37, నంద్యాల డివిజన్‌లో 35 పోస్టులను పోస్టల్ డిపార్ట్‌మెంట్ భర్తీ చేయనుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఎంపికైన వారికి బీపీఎం అయితే రూ.12 వేలు+అలవెన్సులు, ఏబీపీఎం అయితే రూ.10 వేలు+అలవెన్సులు జీతంగా ఇవ్వనున్నారు. పూర్తి వివరాలకు https://indiapostgdsonline.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. SHARE IT
Similar News
News October 13, 2024
జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్
నేటి నుంచి 16వ తేది వరకు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రంజిత్ బాషా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం భారీ వర్షాల సూచన నేపథ్యంలో కలెక్టర్ సబ్ కలెక్టర్, ఆర్డీవోలు, తహసీల్దార్లు, మండల స్పెషల్ ఆఫీసర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
News October 13, 2024
దేవరగట్టు బన్నీ ఉత్సవాల్లో ఉద్రిక్తత.. 70 మందికిపైగా గాయాలు?
కర్నూలు జిల్లా దేవరగట్టు బన్నీ ఉత్సవాల్లో ఉద్రిక్తత నెలకొంది. కర్రల సమరంలో హింస చెలరేగింది. దేవతామూర్తులు మాళమ్మ, మల్లేశ్వరస్వామి విగ్రహాలను దక్కించుకునేందుకు భక్తులు రెండు వర్గాలుగా విడిపోయి కర్రలతో కొట్లాడారు. దీంతో సుమారు 70 మందికిపైగా గాయాలైనట్లు తెలుస్తోంది. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.
News October 12, 2024
కర్రల సమరానికి సిద్ధమైన ‘దేవరగట్టు’
హోళగుంద మండల పరిధిలోని దేవరగట్టు కర్రల సమరానికి సిద్ధమైంది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి కర్రల సమరం వీక్షించేందుకు పల్లెజనం ఇప్పటికే భారీగా దేవరగట్టు చేరుకున్నారు. కాగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా బన్నీ ఉత్సవాలకు ఎస్పీ బిందు మాధవ్ 800 మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. 100 నైట్ విజన్ సీసీ కెమెరాలు, 5 డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచారు.