News March 20, 2024

కర్నూలు జిల్లాలో CM జగన్ పర్యటన

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలో CM జగన్ పర్యటించనున్నట్లు వైసీపీ నాయకులు వెల్లడించారు. ఈనెల 27న ఇడుపులపాయ నుంచి ఆయన ‘మేమంతా సిద్ధం’ పేరిట బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రొద్దుటూరులో CM జగన్ తొలి బహిరంగ సభ నిర్వహించనున్నారు. అనంతరం ఈనెల 28న నంద్యాల, 29న కర్నూలు జిల్లాలో నిర్వహించే బస్సు యాత్ర, బహిరంగ సభలో CM జగన్ పాల్గొననున్నారు.

Similar News

News September 17, 2024

కర్నూలు: రూ.2 లక్షలు పలికిన మహాగణపతి లడ్డూ

image

కర్నూలు పాత నగరంలోని తుంగభద్ర నదీ తీరాన కొలువుదీరిన 63 అడుగుల మహాగణపతి విగ్రహం వద్ద జరిగిన లడ్డూ వేలం పాటలో కాంచనం సురేశ్ బాబు (స్వస్తిక్ డెవలపర్స్) రూ.2 లక్షలకు దక్కించుకున్నారు. నగరానికి చెందిన చింటూ, భరత్, వికాస్ స్వామివారి హుండీని రూ.1,45,000కు పాట పాడి దక్కించుకున్నారు.

News September 17, 2024

గుంటూరు ప్యాసింజర్ ట్రైన్‌లో మృతదేహం

image

డోన్ పట్టణం రైల్వేస్టేషన్‌లో గుంటూరు ప్యాసింజర్ ట్రైన్‌లోని టాయిలెట్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని మంగళవారం రైల్వే అధికారులు గుర్తించారు. మృతుడికి సుమారు 55 నుంచి 65 ఏళ్ల మధ్య వయసు ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 17, 2024

17,523 ఎకరాల్లో పంట నష్టం: నంద్యాల కలెక్టర్

image

నంద్యాల జిల్లాలో భారీ వర్షాలకు దెబ్బతిన్న 17,523 ఎకరాల పంటలకు నష్టపరిహారం కోసం ప్రభుత్వానికి నివేదికలు పంపామని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. 400 ఎకరాలలో గుర్తించిన పండ్లతోటల పెంపకానికి చర్యలు తీసుకుంటామన్నారు. 57 ఆయిల్ ఫామ్ ప్లాంట్లను ప్రోత్సహించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. పశుసంపదకు డీ వార్మింగ్, వ్యాక్సినేషన్ పూర్తయిందన్నారు.