News February 1, 2025
కర్నూలు జిల్లా ఎస్పీగా విక్రాంత్ పాటిల్ బాధ్యతల స్వీకరణ
శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జిల్లాలో ఎక్కడైనా సమస్యలుంటే తమకు తెలపాలని, వాటిపై తగిన చర్యలు తీసుకుంటామని ప్రజలకు సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామన్నారు.
Similar News
News February 2, 2025
పత్తికొండ కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్
పత్తికొండ పర్యటనలో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్ పీ.రంజిత్ బాషా మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులకు అందిస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని స్వయంగా ఆయన వెళ్లి పరిశీలించారు. కలెక్టర్ వెంట పత్తికొండ ఎమ్మెల్యే కెఈ శ్యామ్ బాబు, ట్రైనీ కలెక్టర్, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
News February 1, 2025
స్ఫూర్తిని ప్రదర్శించి క్రీడాకారులు పోటీల్లో రాణించాలి: కలెక్టర్
క్రీడాకారులు స్ఫూర్తిని ప్రదర్శించి పోటీల్లో పాల్గొని రాణించినప్పుడే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ పీ.రంజిత్ బాషా అన్నారు. శనివారం పత్తికొండలోని క్రీడా మైదానంలో కేఈ మాదన్న స్మారక దక్షిణ భారత స్థాయి క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే శ్యాం బాబు ఆధ్వర్యంలో శాప్ ఛైర్మన్ రవి నాయుడు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డితో కలిసి కలెక్టర్ ప్రారంభించారు.
News February 1, 2025
సర్వర్ డౌన్.. పింఛన్ పంపిణీకి అంతరాయం
కర్నూలు జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ కానుక పంపిణీ కార్యక్రమంలో సర్వర్ సమస్య నెలకొంది. ఉదయం 6 గంటలకు పింఛన్ అందజేసేందుకు అధికారులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లగా కొంతసేపు సర్వర్ పనిచేసింది. అనంతరం ‘processing.. please wait’ అన్న ఎర్రర్ కోడ్ వస్తుండటంతో పంపిణీకి అంతరాయం ఏర్పడింది. ఫోన్‌లో ఆ యాప్ పనిచేస్తేనే పింఛన్ పంపిణీ చేసేందుకు అవకాశం ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య తలెత్తినట్లు సమాచారం.