News August 15, 2024

కర్నూలు జిల్లా చరిత్రలో గాంధీ అడుగు జాడలు

image

భారత స్వాతంత్ర్యోద్యమ సంగ్రామంలో జాతిపిత మహాత్మా గాంధీ 1921, 1929 సంవత్సరాల్లో కర్నూల్ జిల్లాలో పర్యటించారు. 1921 SEP 29న తొలిసారి రైలులో కర్నూలు చేరుకున్నారు. జిల్లా పర్యటనలో మహాత్ముడి ఉపన్యాసాలు లక్షలాది మందిలో ఉద్యమ స్ఫూర్తిని నింపాయి. స్వరాజ్య నిధికి భారీ విరాళాలు అందజేశారు. అప్పట్లో జనాలను ఉద్దేశించి హిందీలో ప్రసంగించగా ఆయన ఉపన్యాసాన్ని కొండా వెంకటప్పయ్య పంతులు తెలుగులో అనువాదం చేశారు.

Similar News

News January 11, 2026

సజ్జల తీరుతోనే జగన్‌కు 151 నుంచి 11 సీట్లు: ఎమ్మెల్సీ బీటీ

image

కనీసం వార్డు మెంబర్‌గా గెలవని సజ్జల రామకృష్ణారెడ్డి చట్టసభలు, ప్రభుత్వ విధానాలపై మాట్లాడటం విడ్డూరమని ఎమ్మెల్సీ బీటీ నాయుడు ఎద్దేవా చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో సజ్జల అనాలోచిత సలహాల వల్లే జగన్ 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయారని విమర్శించారు. సలహాదారుగా ఉండి ప్రజల సొమ్ము దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ప్రస్తుతం సొంత పార్టీ నేతలే ఆయనను తిరస్కరిస్తున్నారని తెలిపారు.

News January 11, 2026

సీఎం యాప్‌లో నమోదుతోనే కందుల కొనుగోలు

image

రైతు సేవా కేంద్రాల ద్వారా సీఎం యాప్‌లో వివరాలు నమోదు చేసుకున్న తర్వాతే కందుల విక్రయాలు చేపట్టాలని కర్నూలు జిల్లా వ్యవసాయాధికారిని వరలక్ష్మి శనివారం తెలిపారు. ప్రభుత్వం క్వింటాలుకు రూ.8 వేల మద్దతు ధర నిర్ణయించిందని పేర్కొన్నారు. కందులలో తేమ శాతం 12 లోపు ఉండాలని సూచించారు. ఇప్పటివరకు 5,379 మంది రైతులు యాప్‌లో పేర్లు నమోదు చేసుకున్నట్లు ఆమె వెల్లడించారు.

News January 10, 2026

టీచర్‌గా మారిన కర్నూలు కలెక్టర్

image

కల్లూరు మండల పర్యటనలో భాగంగా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి టీచర్‌గా మారారు. మండల పరిధిలోని పందిపాడులో అంగన్వాడీ కేంద్రాన్ని ఆమె శనివారం తనిఖీ చేశారు. పిల్లలతో కూర్చుని ప్రీ స్కూల్ విద్యలో వారి సామర్థ్యాలను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులను ప్రశ్నలు అడుగుతూ వారిని ఆకట్టుకునే ప్రయత్నం కలెక్టర్ చేయడంతో చిన్నారులు మంత్రముగ్ధులు అయ్యారు.