News January 23, 2025
కర్నూలు జిల్లా నిందితుడికి 20ఏళ్ల జైలు శిక్ష

కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం గంజహల్లి గ్రామానికి చెందిన షేక్షావలి (30) కర్నూలులోని ఓ మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తల్లి జి.శాంత ఫిర్యాదు మేరకు 2021 ఆగస్టు 12వ తేదీన పోక్సో యాక్ట్ నమోదు చేశారు. అన్ని కోణాల్లో విచారించిన కర్నూలు జిల్లా స్పెషల్ పోక్సో కోర్టు జడ్జి నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారని ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు.
Similar News
News February 7, 2025
మీ పిల్లల టాలెంట్‌ని అందరికీ చెప్పాలనుకుంటున్నారా

డ్యాన్స్, సింగింగ్, డ్రాయింగ్, స్పీచ్ ఇలా ఏదైనా మీ పిల్లల్లో ప్రతిభ ఉంటే 5 నిమిషాలు మించకుండా వీడియో తీసి తప్పకుండా ఎడిట్ చేయండి. పిల్లల పేరు, తరగతి, గ్రామం వివరాలతో.. 97036 22022 నంబరుకు వాట్సప్ చేయండి. Way2News ఎంపిక చేసిన ఉత్తమ వీడియోను ప్రతి ఆదివారం సా.6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
➤ ఆదివారం ఉదయం 9 నుంచి 10 గంటల మధ్యలో వచ్చిన వీడియోలనే పరిగణిస్తాం.
➤ 15 ఏళ్ల లోపు పిల్లల వీడియోలే తీసుకుంటాం.
News February 6, 2025
ఓర్వకల్లు దగ్గర ప్రమాదం.. ఇద్దరు మృతి

కర్నూలు జిల్లాలో గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓర్వకల్లు వద్ద ట్రాక్టర్, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. మృతులు జానకి(60), విహారిక(4)గా గుర్తించారు. తిరుమల దర్శనం చేసుకుని తిరిగి రాయచూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 6, 2025
TG భరత్‌కు 15వ ర్యాంకు

మంత్రుల పనితీరు ఆధారంగా సీఎం చంద్రబాబు ర్యాంకులు కేటాయించారు. మంత్రులుగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి గత డిసెంబర్ వరకు ఫైళ్లను త్వరగా క్లియర్ చేసిన వారికి మెరుగైన ర్యాంకు లభించింది. ఈక్రమంలో కర్నూలుకు చెందిన మంత్రి టీజీ భరత్‌కు 15వ ర్యాంకు లభించింది. నంద్యాలకు చెందిన ఫరూక్‌కు మొదటి ర్యాంకు, బనగానపల్లెకు చెందిన బీసీ జనార్దన్ రెడ్డి 9వ ర్యాంకు లభించింది.