News March 14, 2025
కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

➤ 172 పరీక్షా కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు
➤ కర్నూలు జిల్లా వాసికి ఆల్ ఇండియా 199వ ర్యాంకు
➤ నంద్యాల: వైసీపీ నేతపై హత్యాయత్నం.. 9మంది టీడీపీ నేతలపై కేసు
➤ స్త్రీల వేషంలో పురుషులు.. రతీ మన్మథులకు పూజలు
➤ మంత్రాలయంలో కన్నడ సీరియల్ షూటింగ్
➤ ఆదోని: ఇన్ స్టాగ్రామ్ లో ప్రేమ.. పెద్దల సమక్షంలో పెళ్లి
➤ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన పెద్దకడబురు విద్యార్థులు
➤వైఎస్ జగన్ పై సోమిశెట్టి తీవ్ర విమర్శలు
Similar News
News November 21, 2025
సర్వీస్ నుంచి కర్నూలు సీఐ శంకరయ్య డిస్మిస్

సీఐ జె.శంకరయ్యను పోలీస్ శాఖ సర్వీస్ నుంచి డిస్మిస్ (తొలగింపు) చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఆదేశాల మేరకు ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం శంకరయ్య కర్నూలు వీఆర్లో ఉంటూ సీఐగా విధులు నిర్వహిస్తున్నారు. శంకరయ్యను క్రమశిక్షణా చర్యలపై డిస్మిస్ చేసినట్లు ఆయన తెలిపారు.
News November 21, 2025
PMAY-G పేరు నమోదు చేసుకోండి: కలెక్టర్

కర్నూలు జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ (PMAY-G 2.0) కింద గృహాల కోసం లబ్ధిదారుల పేర్ల నమోదు చేసుకోవాలని కర్నూలు కలెక్టర్ డా.సిరి సూచించారు. గ్రామ/వార్డు సచివాలయంలో పేర్ల నమోదుకు ఈ నెల 30లోపు పూర్తి చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News November 20, 2025
పత్తి రైతులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకూడదు: కలెక్టర్

గూడూరు మండలం పెంచికలపాడు సమీపంలోని మంజీత్ కాటన్ ప్రైవేట్ లిమిటెడ్ & ప్రెసింగ్ యూనిట్లో సీసీఐ ఆధ్వర్యంలో జరుగుతున్న పత్తి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఏ.సిరి పరిశీలించారు. రైతులతో మాట్లాడిన ఆమె.. పత్తి సేకరణ, కొలతలు, రేట్లపై సమాచారం తీసుకున్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. సకాలంలో చెల్లింపులు చేయాలని సీసీఐ అధికారులను ఆదేశించారు.


