News April 4, 2025

కర్నూలు జిల్లా నేతలతో వైఎస్ జగన్ సెల్ఫీ

image

కోడుమూరు వైసీపీ నేత, కుడా మాజీ ఛైర్మన్‌ కోట్ల హర్షవర్దన్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకకు హాజరైన మాజీ సీఎం వైఎస్ జగన్ జిల్లా నేతలను ఆప్యాయంగా పలకరించారు. వారి కోరిక మేరకు సెల్ఫీ తీసుకున్నారు. అందుకు సంబంధించిన ఫొటోను ఎమ్మిగనూరు వైసీపీ ఇన్‌ఛార్జి బుట్టా రేణుక నెట్టింట పోస్ట్ చేశారు. ‘జగనన్నతో స్నేహపూర్వక సమావేశం. ఆప్యాయంగా సెల్ఫీ తీసుకున్నారు’ అని ట్వీట్ చేశారు.

Similar News

News December 9, 2025

తేగలు తింటే ఎన్ని లాభాలో..!

image

శీతాకాలంలో తాటి తేగలు (గేగులు) ఎక్కువగా లభిస్తుంటాయి. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. అలాగే తేగల్లో ఖనిజాలు, విటమిన్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా రక్తహీనత నివారణ, శరీర బరువును నియంత్రించడంలో ఇవి సహాయపడతాయి. షుగర్ వ్యాధిగ్రస్థులూ తినొచ్చు. తాటి గింజలు మొల‌కెత్తిన‌ప్పుడు నేల‌లో నుంచి త‌వ్వి తీసిన మొల‌క‌లే ఈ తేగలు. మీరెప్పుడైనా టేస్ట్ చేశారా? comment

News December 9, 2025

మెదక్: కోడ్ ఎఫెక్ట్.. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కలెక్టర్ దూరం

image

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్‌ల ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాలు ఈరోజు ఆవిష్కరించారు. ముందుగా కలెక్టర్ల చేతుల మీదుగా విగ్రహాలు ఆవిష్కరణ జరుగుతుందని అధికార యంత్రాంగం తెలిపింది. కానీ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కోడ్ అమల్లో ఉన్నందున మెదక్‌లో కలెక్టర్, అదనపు కలెక్టర్, ఎస్పీలు దూరంగా ఉన్నారు. దీంతో డీఆర్ఓ చేతుల మీదుగా ఆవిష్కరణ చేసి కార్యక్రమం ముగించారు.

News December 9, 2025

జడ్చర్ల: పంచాయతీ ఏర్పడిన ఐదేళ్లకు ఎన్నికలు

image

జడ్చర్ల మండలం బండమీదిపల్లి గ్రామం ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పడిన తర్వాత 2020 డిసెంబర్ 20 నుంచి ప్రత్యేక అధికారి పాలనలో నడుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తుండడంతో గ్రామంలో మూడో విడత ఎన్నికల నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సమస్యలు తీరి గ్రామ సర్పంచ్ పాలనలో గ్రామ అభివృద్ధి చెందిందని గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేశారు.