News September 5, 2024
కర్నూలు జిల్లా YCP అధ్యక్షుడిగా ఎస్వీ మోహన్ రెడ్డి

కర్నూలు జిల్లా వైసీపీ నూతన అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి నియమితులయ్యారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో పార్టీ అధిష్ఠానం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షురాలిగా కార్పొరేటర్ నారాయణమ్మ కొనసాగారు. కాగా, 2014 నుంచి 2019 వరకు ఎస్వీ మోహన్ రెడ్డి కర్నూలు నియోజకవర్గం ఎమ్మెల్యేగా పని చేశారు.
Similar News
News December 20, 2025
రహదారి ప్రమాదాల నివారణే లక్ష్యం: డీఐజీ, ఎస్పీ

రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా ప్రతీ శనివారం ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పోలీసు స్టేషన్ పరిధుల్లో రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలపై సమావేశాలు నిర్వహించారు. తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు.
News December 20, 2025
కర్నూలు: మిరప పంటలో గంజాయి సాగు

చిప్పగిరి మండలం దేగులపాడు గ్రామ పరిధిలో మిరప పంటలో అంతర పంటగా గంజాయి సాగు చేసినట్లు పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. పొలాన్ని తనిఖీ చేసి గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News December 20, 2025
నూతన ఆలోచనలతో అద్భుతాలు సృష్టించాలి: కలెక్టర్

నూతన ఆలోచనలతో విద్యార్థులు అద్భుతాలు సృష్టించాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. శనివారం కర్నూలు ప్రభుత్వ టౌన్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి విద్య, వైజ్ఞానిక ప్రదర్శనలను డీఈవో సుధాకర్, ఏపీసీ లోకరాజుతో కలిసి ఆమె ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు తమ ఆలోచనలకు పదును పెట్టి నమూనాలను రూపొందించాలన్నారు.


