News March 23, 2024

కర్నూలు: టీడీపీని వీడి కాంగ్రెస్ నుంచి పోటీకి తిక్కారెడ్డి సై?

image

టికెట్ రాకపోవడంతో తిక్కారెడ్డి, ఆయన అనుచరులు TDP అధిష్ఠానంపై మండిపడుతున్నారు. తన భవిష్యత్ కార్యచరణ కోసం ఇప్పటికే కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. కార్యకర్తల సూచనల మేరకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం తిక్కారెడ్డి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కాగా హైకమాండ్ తిక్కారెడ్డిని బుజ్జగించి రాఘవేంద్రరెడ్డి విజయానికి పనిచేసేలా చేయకపోతే గెలుపు కష్టమేనని స్థానిక నేతలు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.

Similar News

News February 11, 2025

కోరికల కొండ గురించి తెలుసా?

image

శ్రీశైలం పాదయాత్రలో పెద్ద చెరువు దాటిన తర్వాత కోరికల కొండ వస్తుంది. ఈ కొండ మీద మన కోరిక చెప్పుకుంటే తీరుతుందని భక్తుల నమ్మకం. పెళ్లి కావాలనుకునే వారు అక్కడ చిన్న పందిరి వేస్తారట. సంతానం కోరుకొనే వారు ఉయ్యాల కడతారు. సొంతిల్లు కావాలనుకునే వారు ఒక రాయి మీద ఇంకో రాయి పేరుస్తారు. కొంత మంది తమ కోరికలు ఆ కొండ మీద మట్టిలో చేతితో రాస్తారట. మరి మీరు శ్రీశైలానికి పాదయత్రగా వెళ్లారా?

News February 11, 2025

నేడు అహోబిలం రానున్న హీరో సాయిదుర్గ తేజ్

image

ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలం ఆలయ దర్శనార్థం మంగళవారం ఉదయం 10 గంటలకు హీరో సాయిదుర్గ తేజ్ వస్తున్నట్లు జనసేన పార్టీ సమన్వయకర్త మైలేరి మల్లయ్య తెలిపారు. ఆళ్లగడ్డ ప్రాంతంలోని అభిమానులు అహోబిలం క్షేత్రానికి వచ్చి ఆయన పర్యటనను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

News February 11, 2025

ఛాంపియన్‌గా కర్నూలు జిల్లా జట్టు

image

యోగ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో రెండు రోజులుగా పెద్దపాడులోని ఓ పాఠశాల నందు నిర్వహిస్తున్న 1వ రాష్ట్ర స్థాయి యోగా లీగ్ పోటీలు సోమవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి కేఎంసీ డిప్యూటీ మేయర్ రేణుక ముఖ్య అతిథిగా హాజరై గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులను అందించారు. కర్నూలు, అనంతపూర్, నంద్యాల జిల్లా జట్లు వరుసగా మూడు స్థానాలలో నిలిచాయి.

error: Content is protected !!