News April 19, 2024
కర్నూలు టీడీపీ అభ్యర్థి ఆస్తుల విలువ ఎంతంటే..?
కర్నూలు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బస్తిపాడు నాగరాజు, ఆయన భార్య జయసుధ గురువారం నామినేషన్లు దాఖలు చేశారు. నాగరాజు ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన
అఫిడవిట్‌లో తన చర, స్థిరాస్తుల వివరాలను ప్రకటించారు. తనకు, తన భార్యకు కలిపి మొత్తం రూ.8,54,79,900 స్థిర, చరాస్తులు ఉన్నాయని
అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
Similar News
News September 17, 2024
కర్నూలు: రూ.2 లక్షలు పలికిన మహాగణపతి లడ్డూ
కర్నూలు పాత నగరంలోని తుంగభద్ర నదీ తీరాన కొలువుదీరిన 63 అడుగుల మహాగణపతి విగ్రహం వద్ద జరిగిన లడ్డూ వేలం పాటలో కాంచనం సురేశ్ బాబు (స్వస్తిక్ డెవలపర్స్) రూ.2 లక్షలకు దక్కించుకున్నారు. నగరానికి చెందిన చింటూ, భరత్, వికాస్ స్వామివారి హుండీని రూ.1,45,000కు పాట పాడి దక్కించుకున్నారు.
News September 17, 2024
గుంటూరు ప్యాసింజర్ ట్రైన్‌లో మృతదేహం
డోన్ పట్టణం రైల్వేస్టేషన్‌లో గుంటూరు ప్యాసింజర్ ట్రైన్‌లోని టాయిలెట్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని మంగళవారం రైల్వే అధికారులు గుర్తించారు. మృతుడికి సుమారు 55 నుంచి 65 ఏళ్ల మధ్య వయసు ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News September 17, 2024
17,523 ఎకరాల్లో పంట నష్టం: నంద్యాల కలెక్టర్
నంద్యాల జిల్లాలో భారీ వర్షాలకు దెబ్బతిన్న 17,523 ఎకరాల పంటలకు నష్టపరిహారం కోసం ప్రభుత్వానికి నివేదికలు పంపామని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. 400 ఎకరాలలో గుర్తించిన పండ్లతోటల పెంపకానికి చర్యలు తీసుకుంటామన్నారు. 57 ఆయిల్ ఫామ్ ప్లాంట్లను ప్రోత్సహించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. పశుసంపదకు డీ వార్మింగ్, వ్యాక్సినేషన్ పూర్తయిందన్నారు.