News April 16, 2025
కర్నూలు టీడీపీ కార్యాలయంపై దాడి.. నలుగురి అరెస్టు

కర్నూలులోని డీమార్ట్ వెనక ఉన్న టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో నలుగురిని నాల్గో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ బాబు ప్రసాద్ వివరాల ప్రకారం.. టీడీపీ కార్యాలయంపై ప్రభాకర్ నాయుడు, కాశీ, రహంతుల్లా, సలాంఖాన్ దాడికి పాల్పడ్డారు. వేటకొడవళ్లు, కత్తులతో కార్యాలయంలోని శేఖర్ గౌడ్‌పై దాడికి యత్నించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Similar News
News November 28, 2025
పీజీఆర్ఎస్ అర్జీలు గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్

పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, సర్వే అర్జీలు అధికంగా వస్తున్న నేపథ్యంలో వాటిని డ్రైవ్ మోడ్లో క్లియర్ చేయాలని వీడియో కాన్ఫరెన్స్లో సూచించారు.
లాగిన్లో అర్జీలు పెండింగ్లో ఉన్నాయంటూ మండల సర్వేయర్, తహశీల్దార్లను కలెక్టర్ ప్రశ్నించారు. అర్జీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News November 28, 2025
ఆదోని మండల విభజన గెజిట్ విడుదల

ఆదోని మండలాన్ని రెండు మండలాలుగా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు. ఆదోని, పెద్దహరివాణం పేర్లతో రెండు కొత్త మండలాలు ఏర్పాటయ్యాయి. ఆదోని హెడ్క్వార్టర్గా 29 గ్రామాలు, పెద్దహరివాణం హెడ్క్వార్టర్గా 17 రెవెన్యూ గ్రామాలను కలుపుతూ మండలాల పునర్విభజన చేపట్టినట్లు వివరించారు. అభ్యంతరాలు ఉంటే 30 రోజుల లోపు తెలపాలన్నారు.
News November 28, 2025
ఓటర్ల మ్యాపింగ్‌లో పొరపాట్లకు తావివ్వరాదు:కలెక్టర్

కర్నూలు జిల్లాలో జరుగుతున్న ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలో తప్పులు చోటుచేసుకోకుండా చూడాలని జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా. సిరి బిఎల్వోలకు ఆదేశాలు జారీ చేశారు. ముందుగా టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ పూర్తిచేసి అనంతరం ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు సేకరించాలని గురువారం సూచించారు. మరణించినవారి పేర్లు, అందుబాటులోలేని ఓటర్ల వివరాలు, నోటీసులు జారీచేసి తొలగించే చర్యలు తీసుకోవాలన్నారు.


