News February 12, 2025
కర్నూలు: టెన్త్ అర్హతతో 55 ఉద్యోగాలు

కర్నూలు జిల్లా (డివిజన్)లో 55 GDS పోస్టుల భర్తీకి భారత తపాలా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్ అర్హతతో కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి ఉండాలి. వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. టెన్త్‌లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3వ తేదీ వరకు https://indiapostgdsonline.gov.in/లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Similar News
News March 20, 2025
డిప్యూటీ సీఎం పర్యటనను విజయవంతం చేయండి: కలెక్టర్

ఈ నెల 22న డిప్యూటీ సీఎం జిల్లాకు రానున్నారని, అందుకు సంబంధించి ఏర్పాట్లు పకడ్బందీగా చేసి జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని అధికారులను కలెక్టర్ పీ.రంజిత్ బాషా ఆదేశించారు. డిప్యూటీ సీఎం ఓర్వకల్లు మండలం పూడిచెర్ల గ్రామ పరిధిలో ఉన్న రైతు పొలంలో ఫారంపాండ్‌కు భూమిపూజ చేయనున్నారు. తదుపరి బహిరంగ సభలో పాల్గొననున్న సందర్భంగా ఎస్పీతో కలిసి కలెక్టర్ పరిశీలించారు.
News March 20, 2025
ఆదోని మున్సిపల్ ఛైర్ పర్సన్ శాంత నిరసన

ఆదోని మున్సిపల్ ఛైర్ పర్సన్ శాంత గురువారం నిరసన చేపట్టారు. పట్టణంలోని కోట్ల విగ్రహం వద్ద నిరాహార దీక్షకు పూనుక్కున్నారు. ఏ తప్పు చేయకున్నా అవిశ్వాస తీర్మానం పెట్టాలని కౌన్సిలర్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడం తగదన్నారు. నాలుగేళ్ల పాటు నిజాయితీగా ఉంటూ వైసీపీలోనే కొనసాగుతున్నన్నారు. ఆ పార్టీ కౌన్సిలర్లే పదవి దింపాలని చూడటం సమంజసం కాదని అన్నారు. న్యాయం చేయాలని మాజీ సీఎం జగన్‌ను కోరుతామని తెలిపారు.
News March 20, 2025
కర్నూలు: ఈవీఎం వేర్ హౌస్‌ను పరిశీలించిన కలెక్టర్

త్రైమాసిక తనిఖీలో భాగంగా ఈవీఎంలు భద్రపరచిన వేర్ హౌస్‌ను జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పరిశీలించారు. బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టరేట్ ఆవరణలోని ఈవిఎం వేర్ హౌస్‌లో ఈవీఎంలను భద్రపరచిన తీరును కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఉన్న పోలీసు గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఈవీఎంలను భద్రతపై నిరంతర పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.