News February 13, 2025
కర్నూలు: టెన్త్ అర్హత.. 70 కంపెనీల్లో ఉద్యోగాలు

ఆలూరులోని ఇబ్రహీం ఫంక్షన్ హాలులో ఈ నెల 20న మెగా ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు బహుజన టైమ్స్ సభ్యుడు దుర్గాప్రసాద్ తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లమా, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ చేసిన నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. దాదాపు 70 కంపెనీల ప్రతినిధులు ఈ మేళాలో పాల్గొంటారని తెలిపారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సహకారంతో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News March 24, 2025
కర్నూలు మేయర్ పీఠంపై టీడీపీ కన్ను!

కర్నూలు మేయర్ బీవై రామయ్యకు అవిశ్వాస గండం తప్పదా? ఈ అంశం ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మరో ఏడాది పదవీ కాలం ఉండగా TDP అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. నగర కార్పొరేషన్‌లో 52మంది కార్పొరేటర్లు ఉన్నారు. ప్రస్తుతం టీడీపీ బలం 22కు చేరింది. మేయర్ పీఠం దక్కించుకోవాలంటే 28మంది అవసరం. పలువురు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం.
News March 24, 2025
కర్నూలులో టీడీపీ నేత హత్య.. నిందితుడి భార్య అరెస్ట్

కర్నూలులో పాత కక్షలతోనే టీడీపీ నేత సంజన్న ఇటీవల హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తాజాగా నిందితుడు వడ్డె రామాంజనేయులు భార్య సావిత్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. వడ్డె రామాంజనేయులుతో పాటు అతడి ముగ్గురు కుమారులు, మరొకరిని పోలీసులు ఇది వరకే అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
News March 24, 2025
డబుల్ సెంచరీతో చెలరేగిన రుత్విక్ కళ్యాణ్

కర్నూలులో జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన పోటీల్లో కర్నూలుకు చెందిన రుత్విక్ కళ్యాణ్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. నంద్యాలతో జరిగిన మ్యాచ్‌లో 219 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మరోవైపు ఆదోనితో జరిగిన మ్యాచ్‌లో 122 బంతుల్లో 154 పరుగులు చేసి తన సత్తా చాటాడు. క్రికెట్‌లో అంతర్జాతీయ స్థాయికి రుత్విక్ కళ్యాణ్ చేరుకోవాలని పలువురు ఆకాంక్షించారు.